కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్(Constable Recruitment) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగియడానికి ఇంకా కేవలం నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. మొత్తం 25,487 కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 31 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు 1,105 ఉద్యోగాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Chennai: AVNLలో భారీ జీతంతో కన్సల్టెంట్ ఉద్యోగాలు
అభ్యర్థుల ఎంపికను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), శారీరక సామర్థ్య పరీక్షలు (PST/PET), మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) ద్వారా నిర్వహిస్తారు. CBT పరీక్షలను 2026 ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(Constable Recruitment) కోరుకునే యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: