లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా కూలీ (Coolie). ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ విడుదల సమయంలో వచ్చిన విమర్శలపై తాజాగా లోకేష్ స్పందించారు.
Read Also: Eagle Team: డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. అమన్ ప్రీత్ సింగ్ పేరు మళ్లీ వెలుగులోకి
అభిమానులకు ధన్యవాదాలు
దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ విమర్శలను స్వీకరిస్తూ, ప్రేక్షకులు రజనీకాంత్ కోసమే సినిమా చూశారని, రాబోయే సినిమాల్లో తప్పులు సరిదిద్దుకుంటానని హామీ ఇచ్చారు. కూలీ సినిమాపై వచ్చిన విమర్శలను తాను గమనించానని, రాబోయే చిత్రాల్లో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని తెలిపారు. సినిమాను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటివరకు లోకేష్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ తెరకెక్కించిన సినిమా కూలీ. ఇందులో నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: