భారత్‌లో జరగనున్న వైట్ బాల్ సిరీస్ (IND vs NZ) కోసం న్యూజిలాండ్ రెండు ఫార్మాట్లకు క్రికెట్ జట్లు ప్రకటించింది. వన్డే సిరీస్‌లో మిచెల్ శాంట్నర్ అందుబాటులో లేకపోవడంతో మైకెల్ బ్రేస్‌వెల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతడికి డెవాన్ కాన్వే, డెరిల్ మిచెల్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్ వంటి అనుభవజ్ఞుల మద్దతు లభించనుంది. టీ20 సిరీస్‌లో మాత్రం గాయాల నుంచి కోలుకుంటున్న మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చి, అదే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే అతడిని కేవలం టీ20 జట్టుకే పరిమితం చేశారు.
Read Also: VHT: నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం
బేవన్ జేకబ్స్, టిమ్ రాబిన్సన్
టెస్ట్ కెప్టెన్ టామ్ లాథమ్ కుటుంబ కారణాల వల్ల వన్డే సిరీస్‌కు దూరంగా ఉండగా, పేసర్ మ్యాట్ హెన్రీ కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే విధంగా నాథన్ స్మిత్, బ్లేర్ టిక్‌నర్, మార్క్ చాప్మన్ కూడా వన్డే (IND vs NZ) ఎంపికకు అందుబాటులో లేరు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి మళ్లీ జట్టులోకి వచ్చారు. దేశీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన బేవన్ జేకబ్స్, టిమ్ రాబిన్సన్‌కు టీ20 జట్టులో అవకాశం దక్కింది.
ఐపీఎల్ ఒప్పందాలు పొందిన జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ కూడా ఎంపికయ్యారు. ఫౌల్క్స్‌కు ఇది భారత్‌లో తొలి టీ20 అనుభవం కానుంది. జేడెన్ లెన్నాక్స్ ఎంపికపై హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ, అతడు చాలా కాలంగా న్యూజిలాండ్ హై-పర్‌ఫార్మెన్స్ సిస్టమ్‌లో నిలకడగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. దేశీయ వైట్ బాల్ క్రికెట్‌లో అతడి ప్రదర్శన ఆధారంగానే ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు.
భారత్‌తో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్లు ఇవే
వన్డే టీం: బ్రేస్‌వెల్(C), ఆది అశోక్, క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, కాన్వే, ఫాల్క్స్, మిచ్ హే, జెమీసన్, నిక్ కెల్లీ, జేడెన్, మిచెల్, నికోల్స్, ఫిలిప్స్, మైఖేల్ రే, యంగ్.
T20 జట్టు: శాంట్నర్(C), బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫాల్క్స్, హెన్రీ, జెమీసన్, జాకబ్స్, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్, రాబిన్సన్, సోధి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: