ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మదర్సా ఉపాధ్యాయులు, సిబ్బందికి పోలీసు చర్యల నుంచి రక్షణ కల్పించిన చట్టాన్ని రద్దు చేసింది. 2016లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల అక్రమాలు వెలుగులోకి వచ్చినా పోలీసులు నేరుగా దర్యాప్తు చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలను తొలగించడంతో మదర్సా సిబ్బందిపై ఫిర్యాదులు లేదా ఆధారాలు లభిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కలిగింది.
Read also: AP Government: క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు

Uttar Pradesh
పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతుందని
ఈ నిర్ణయం మదర్సా విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతుందని యోగి ప్రభుత్వం పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విధానంతోనే ఈ మార్పు తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న చర్యగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: