వైవాహిక బంధం విషయంలో భర్త బాధ్యతలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక తీర్పు వెలువరించింది. రెండో భార్యను పోషిస్తున్నాననే నెపంతో.. మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని నిరాకరించడం చట్టరీత్యా చెల్లదని కోర్టు (Allahabad High Court) స్పష్టం చేసింది. జస్టిస్ హర్వీర్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. పిటిషనర్ మహమ్మద్ ఆసిఫ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, భార్య విడిగా ఉంటున్నప్పుడు ఆమెకు కనీస జీవన ప్రమాణాలను కల్పించడం భర్త నైతిక, చట్టపరమైన బాధ్యత అని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే సాకుతో చట్టబద్ధమైన భార్యకు భరణం నిరాకరించలేరని సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ కోర్టు పేర్కొంది.
Read Also: Breaking News: అఫ్ఘానిస్థాన్, మణిపూర్‌లో భూకంపం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: