సికింద్రాబాద్‌లోని వారాసిగూడ(Warasiguda) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న యువతి(17)ని మధ్యాహ్నం సమయంలో సమీప బంధువు ఉమాశంకర్ అనే యువకుడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. టైల్స్ పనిచేసే ఉమాశంకర్‌కు ఎక్కువగా మద్యం సేవించే అలవాటు ఉండటంతో సదరు యువతి కొంత అనాసక్తి చూపింది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Read Also: HYD: రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరుపై కొనసాగుతున్న రగడ

మేనమామ వరసయ్యే యువకుడు
యువతి ఇంట్లోకి వెళ్లిన ఉమాశంకర్ తనతో తీసుకువచ్చిన కత్తితో ఆమె మెడపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై, రక్తస్రావం కాగా ఆ విద్యార్థిని కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె దారుణ హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటనాస్థలికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థినికి మేనమామ వరసయ్యే యువకుడు ఉమాశంకర్‌తో ఇటీవల తమ పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అనంతరం వారి ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ రోజు మాట్లాడతానంటూ యువతి ఇంటికి వెళ్లి తల్లి ముందే దారుణంగా చాకుతో యువతి గొంతు కోసి పరారయ్యాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: