Singareni Jobs: నిరుద్యోగులకు మంచి వార్త! సింగరేణి (singareni) కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో అప్రెంటీస్ ఖాళీల కోసం అభ్యర్థుల దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీలలో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% అవకాశాలు లభిస్తాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 25, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత హార్డ్ కాపీ, విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్ కాపీతో సమీప ఏరియా ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTC) కు పంపాలి.
Read also: JEE 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!

Jobs in Singareni
33 ఏళ్లు వరకు సడలింపు ఉంటుంది
Singareni Jobs: ఎంపిక రాత పరీక్షలు లేకుండా, విద్యార్హత, సీనియారిటీ ఆధారంగా జరుగుతుంది. వయస్సు 18–28 ఏళ్లు, రిజర్వేషన్ వర్గాలకు 33 ఏళ్లు వరకు సడలింపు ఉంటుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మిషనిస్టు, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్స్‌మెన్, డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్స్‌లో ఖాళీలు ఉన్నాయి. ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ అవుతుంది. ఐటీఐ పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్, టర్నర్, ఫిట్టర్, మిషనిస్టు, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్స్‌మెన్‌లకు ₹8,050, డీజిల్ మెకానిక్, వెల్డర్లకు ₹7,700 స్టైపెండ్ మినహాయింపు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ముందుగా SCCL వెబ్‌సైట్ (scclmines.com) లో రిజిస్టర్ అవ్వాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులను నింపాలి.
- విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్ కాపీతో హార్డ్ కాపీ తయారు చేసి సమీప MVTC లో డిసెంబర్ 25, 2025లో సమర్పించాలి.
- ఎంపిక ఫలితాలు SCCL వెబ్‌సైట్, ప్రధాన కార్యాలయ నోటీసు బోర్డులో పొందుపరుస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: