రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) రెండు రోజుల, పర్యటన నిమిత్తం భారత దేశానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, పుతిన్, రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఘన స్వాగతం పలికారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ఎర్ర తివాచీపై నడుస్తూ పుతిన్ భారత దళాల గౌరవవందనం స్వీకరించారు.
Read Also: USA: వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీకి రష్యన్ ప్రతినిధుల బృందాన్ని పుతిన్ (Putin) పరిచయం చేశారు. ఈ సందర్భంగా భారత త్రివిధ దళాలకు చెందిన మిలిటరీ బ్యాండ్‌లు.. ట్రంపెట్, డ్రమ్స్, పైప్స్, క్లారినెట్ వాయిద్య పరికరాలతో రష్యా జాతీయ గీతాలపానతో పాటు భారత జాతీయ గీతాలాపన చేశాయి.
వ్యూహాత్మక అంశాలపై చర్చలు
కాగా, ఉక్రెయిన్ దాడి తర్వాత పుతిన్ భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. మాజీ దౌత్యవేత్త రాజీవ్ భాటియా ఈ పర్యటనను చాలా ముఖ్యమైనదిగా అభివర్ణించారు. రక్షణ, ఇంధనం, రూపాయి-రూబుల్ వాణిజ్యం,
ఆంక్షలను ఎదుర్కోవడం వంటి అనేక వ్యూహాత్మక అంశాలపై చర్చలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక దౌత్యం ద్వారా పశ్చిమ దేశాల నుంచి దూరం జరగకుండానే భారత్, రష్యాను దగ్గరగా ఉంచుకోవాలని కోరుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారు?
2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అధ్యక్షుడయ్యారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: