మూత్ర విసర్జన సమయంలో మంట అనిపించడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. శరీరంలో ఏర్పడే వ్యర్థాలను కిడ్నీలు (kidney) మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. కానీ కొన్ని కారణాల వల్ల మూత్రం విడిచే సమయంలో మంట, అసౌకర్యం అనిపించవచ్చు. పులుపు, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, శరీరంలో నీరు తగ్గిపోవడం, వేడి వాతావరణంలో ఎక్కువ సేపు ఉండడం, మద్యం ఎక్కువగా సేవించడం వంటి పరిస్థితుల్లో మూత్రంలో ఆమ్లత్వం పెరగడం వలన ఈ సమస్య కనిపిస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కొందరికి ఈ సమస్య సహజంగానే తగ్గిపోయినా, తగ్గకపోతే కొన్ని గృహ చిట్కాలు ఉపశమనాన్ని ఇవ్వగలవు.
Read also: Gout : గౌట్ ఉన్నవారు పాటించాల్సిన చిట్కాలు..

Are you suffering from burning sensation in your urine?
బార్లీ జావ తాగడం
బార్లీ జావ తాగడం మూత్రంలో మంటను తగ్గించడంలో చాలా ఉపయోగకరం. బార్లీ మరిగించిన నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరినీళ్లు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తాగడం ద్వారా శరీరానికి చల్లదనం అందుతుంది. పలుచని మజ్జిగను పూటకు ఒక గ్లాస్ తాగితే కూడా ఉపశమనమిస్తుంది. ఉసిరి రసం కొద్దిగా నీటిలో కలిపి తీసుకోవడం కూడా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
పాలకూరను జ్యూస్
ఆహారపు అలవాట్లలో కొంత మార్పు చేసుకోవడం కూడా అవసరం. పాలకూరను జ్యూస్ రూపంలో తీసుకోవడం, కీరదోసను రోజూ తినడం, అరటిపండు ఆహారంలో చేర్చుకోవడం, పుచ్చకాయ మరియు తర్బూజ వంటి నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం శరీరంలో వేడి తగ్గించి, మూత్రంలో మంటను తగ్గిస్తాయి. ఈ సమస్య కేవలం తాత్కాలికమై ఉంటే ఇవి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
మద్యం వంటి పానీయాలను తగ్గించడం
కానీ మూత్రంలో మంటతో పాటు చీము కనిపించడం, వాంతులు, వికారం, కడుపునొప్పి, దుర్వాసన, పదేపదే మూత్రం రావడం, మూత్రం బొట్లు బొట్లుగా రావడం వంటి లక్షణాలు ఉంటే ఇన్‌ఫెక్షన్, కిడ్నీ రాళ్లు లేదా మూత్రాశయ సమస్యల సంకేతాలు కావచ్చు. అలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా టీ, కాఫీ, శీతలపానీయాలు, మద్యం వంటి పానీయాలను తగ్గించడం మంచిది. సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే మూత్రంలో మంట సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: