శ్రీనగర్‌లోని(Srinagar Blast) నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘోర పేలుడు దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 57 ఏళ్ల మహమ్మద్ షఫీ కూడా ఉన్నారు. స్థానికంగా టైలర్‌గా జీవనం సాగిస్తున్న షఫీ, అప్పుడప్పుడూ పోలీసులకు సాయం చేస్తూ అదనపు ఆదాయం సంపాదించేవారు.
Read Also: Shikha Garg: విమాన ప్రమాదంలో మృతురాలి కుటుంబానికి 317 కోట్లు

పేలుడు ముందు జరిగిన విషాదకరమైన క్షణాలు
ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు పదార్థాల పరిశీలన కోసం స్టేషన్‌కు వచ్చినప్పుడు, వారికి సహాయం చేయడానికి పోలీసులు షఫీని పిలిపించారు.
- ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన
- మధ్యాహ్నం భోజనం చేసి, నమాజ్ ముగించుకుని తిరిగి చేరుకున్నారు
- రాత్రి మరోసారి వెళ్లే సమయానికి కూతురు వెళ్లవద్దని వేడుకుంది
కూతురు అభ్యర్థించినా, “కొంచెం పని మిగిలింది… వెంటనే వచ్చేస్తా” అని చెప్పి బయటకు వెళ్లిన షఫీ తిరిగి ఇంటికి చేరలేదు.
భారీ పేలుడు – బూడిద కుప్పగా మారిన స్టేషన్
షఫీ ఇంటినుంచి వెళ్లి ఎక్కువసేపు కాకుండా భారీ పేలుడు శబ్దం వినిపించింది. నౌగామ్(Srinagar Blast) పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైందని తెలుసుకుని కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని షఫీ మృతదేహాన్ని బూడిదకుప్పల మధ్య గుర్తించారు. “నాన్నా, వెళ్లొద్దు” అని ఆపిన కూతురి మాట విన్న… ప్రాణాలతో బయటపడ్డేవారని కుటుంబం వేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పరిహారం ప్రకటింపు
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం:
- మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు
- గాయపడిన వారికి ₹1 లక్ష పరిహారం ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: