हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Telugu News: Chikiri song: 75 మిలియన్ వ్యూస్… యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌

Pooja
Telugu News: Chikiri song: 75 మిలియన్ వ్యూస్… యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’(Chikiri song) పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన వెంటనే ప్రేక్షకులను ముగ్ధులను ఈ మెలోడీ తాజాగా 75 మిలియన్లకు పైగా వ్యూస్, 1.44 మిలియన్లకు పైగా లైక్స్ అందుకొని ఘన విజయాన్ని నమోదు చేసింది. యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో ఇప్పటికీ నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం విశేషం.

Read Also: Globetrotter:ఈవెంట్ ముందు కృష్ణను తలచుకున్నమహేశ్ బాబు

ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ – మోహిత్ చౌహాన్ గాత్రం ఆకట్టింపు

Chikiri song
Chikiri song

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) స్వరపరిచిన ఈ అందమైన పాటకు(Chikiri song) ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ తన మధురమైన వాయిస్‌తో కొత్త ప్రాణం పోశారు. బాలాజీ రాసిన సాహిత్యం సంగీతానికే ప్రత్యేకమైన వెలుగు జతచేసింది. ఈ పాట క్రేజ్‌తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

తారాగణం – టెక్నికల్ టీమ్ హైలైట్స్

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.

  • సినిమాటోగ్రఫీ: రత్నవేలు
  • ఎడిటింగ్: నవీన్ నూలి

‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870