జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ (congress) పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో ఓడించారు. ప్రారంభ రౌండ్ నుంచే ముందంజలో కొనసాగిన నవీన్ యాదవ్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుని స్పష్టమైన గెలుపును సాధించారు. అధికార ఎలెక్షన్ కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు, మాగంటి సునీతకు 74,259 ఓట్లు లభించాయి. ఈ సంఖ్యలతో నవీన్ యాదవ్ సుమారు 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజేతగా నిలిచారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Read also: Diabetes: ఆరోగ్య, శ్రామికశక్తిని హరిస్తున్న మధుమేహం!

Naveen yadav: హోరా హోరు పోరులో కాంగ్రెస్ దే ఘన విజయం
గెలుపు శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని
రౌండ్ రౌండ్‌కు కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ఎటువంటి దశలోనూ కాంగ్రెస్‌ను ఛాలెంజ్ చేయలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ కీలక ఉప ఎన్నికలో గెలుపు శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ విజయం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా మరింత బలం చేకూర్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: