దేశవ్యాప్తంగా నకిలీ ఔషధాల(medicine) తయారీ, విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ సమస్యను పూర్తిగా నియంత్రించేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని ప్రవేశపెట్టి అన్ని ఔషధాలపై క్యూఆర్ కోడ్ (QR Code) తప్పనిసరి చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లతో మందుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఆ ఔషధం అసలైనదా లేక నకిలీదా అని తేలికగా తెలుసుకోవచ్చు.
ఇప్పటికే పాలు, కూరగాయలు, ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగిపోతుండగా, ఇప్పుడు ఔషధాలు కూడా నకిలీ రూపంలో మార్కెట్‌లో లభించడం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఔషధాల నాణ్యత, మూలం, తయారీ వివరాలను వినియోగదారుల చేతుల్లోనే తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
Read also: New Bike: కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి హీరో ఎక్స్‌ట్రీమ్ 125R

క్యూఆర్ కోడ్ స్కాన్‌తో అసలు మందు గుర్తింపు
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు వినియోగదారులు మందు జనరిక్ పేరు, తయారీ తేదీ, గడువు తేది, తయారీ లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, తయారీ ప్రాంతం, యూనిక్ ప్రొడక్ట్ ఐడెంటిఫికేషన్ కోడ్ (UPI) వంటి వివరాలను వెంటనే తెలుసుకోగలరు.
మందు ప్యాకింగ్‌పై కోడ్ లేకపోవడం లేదా స్కాన్ చేసిన తర్వాత వివరాలు రాకపోతే ఆ ఔషధం నకిలీదిగా భావించవచ్చు. ఈ పద్ధతి నకిలీ తయారీదారులను అదుపులో ఉంచడమే కాకుండా వినియోగదారులకు పారదర్శకతను అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ విధానాన్ని అన్ని ఫార్మా సంస్థలకు తప్పనిసరి చేస్తూ దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల నకిలీ మందుల ప్రమాదం గణనీయంగా తగ్గి ప్రజలకు నమ్మకంగా మందులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: