వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్ర్యోద్యమంలో ఆ గేయం ప్రజల్లో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)అన్నారు. దేశ ఐక్యత, దేశభక్తి, యువతలో ఉత్తేజానికి ఆ గేయం ఇంకా మూలంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్‌లో ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా ఓ పోస్టు చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7వ తేదీ వరకు వందే మాతరం ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వందేమాతర గేయం కేవలం పదాల అల్లిక కాదు అని, అది భారత దేశ అంతరాత్మను అందించిన స్వరమన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వందేమాతర గీతం దేశాన్ని ఐక్యంగా నిలిపిందన్నారు. స్వాతంత్య్రోత్సవ జాగరణను బలోపేతం చేసిందన్నారు. మాతృదేశం కోసం అంకితమయ్యేలా, గర్వపడేలా, స్పూర్తి పొందేలా ఆ గేయం విప్లవకారుల్ని ఆకట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also : Modi: వందేమాతరం ఒక మంత్రం: ప్రధాని మోదీ

ఈ ఏడాదితో మన జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ గేయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి బలమైన స్వరంలో పూర్తి పాటను పాడాలని, భవిష్యత్తు తరాలకు వందేమాతర గేయం ప్రేరణగా నిలుస్తుందని అమిత్ షా(Amit Shah) తెలిపారు. వందేమాతర గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ కంపోజ్ చేశారు. సాహిత్య జర్నల్ బంగదర్శన్‌లో నవంబర్ 7, 1875లో ఈ గేయం పబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత 1882లో ప్రచురించిన ఆనందమట్ నవలలోనూ ఈ గేయాన్ని ఆయన పొందుపరిచారు. రబీంద్రనాథ్ ఠాకూర్ ఈ గేయానికి మ్యూజిక్ అందించారు.
అమిత్ షా నియోజకవర్గం?
గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్.కె. అద్వానీ మరియు ప్రస్తుత హోం మంత్రి మరియు మాజీ బిజెపి చీఫ్ అమిత్ షా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అమిత్ షా హోదా?
అమిత్ అనిల్ చంద్ర షా (జననం 22 అక్టోబర్ 1964) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మే 2019 నుండి 32వ హోం మంత్రిగా పనిచేస్తున్నారు, భారత చరిత్రలో ఎక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. అదనంగా, జూలై 2021 నుండి సహకార శాఖకు మొదటి మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :