हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Roja: సినిమాల్లోకి ప‌దేళ్ల త‌ర్వాత‌..రీఎంట్రీ ఇస్తున్న రోజా

Anusha
Latest News: Roja: సినిమాల్లోకి ప‌దేళ్ల త‌ర్వాత‌..రీఎంట్రీ ఇస్తున్న రోజా

ఒకప్పుడు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా (Roja), మరోసారి సినీ రంగంలోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ సమానంగా సత్తా చాటిన రోజా, 90వ దశకంలో టాప్ హీరోయిన్‌గా నిలిచింది.అనేక హిట్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన ఈ అందాల నటి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పింది.

Read Also: Thalaivar 173: రజనీ, కమల్ కాంబోలో సినిమా

తరువాత ‘జబర్దస్త్’ (‘Jabardast’) టీవీ షో ద్వారా ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న రోజా (Roja), మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ షోను కూడా వదిలేసింది. దీంతో ఆమె ఇక మళ్లీ సినిమాలు చేయరని అందరూ భావించారు. ఇప్పటికే పలు టీవీ షోలలో జడ్జిగా, గెస్ట్‌గా హాజరవుతూ రీ-ఎంట్రీ ఇచ్చిన రోజా ఇప్పుడు సినిమా రంగంలోకి కూడా తిరిగి అడుగుపెట్టబోతోంది.

తాజాగా తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై డీ.డి. బాలచంద్రన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రోజా కీలక పాత్రలో నటిస్తోంది. రోజా రీ-ఎంట్రీ సందర్భంగా నటి ఖుష్బూ (Actress Khushboo) ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో రోజా (Roja) 90లలో చేసిన హిట్ సినిమాల క్లిప్స్‌తో పాటు, కొత్త సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. “90s క్వీన్ రోజా తిరిగి వస్తోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో రోజా డీ-గ్లామరస్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వయసు పైబడిన, విషాదంలో ఉన్న మహిళగా ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పాత్రతో ఆమె నటిగా మరోసారి తన సత్తా చాటబోతున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870