ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు పెరుగుతున్నాయి
Indiramma illu update : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజంగా పేదల కలల గూడెం కట్టాలనే లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం ఆ లక్ష్యం చేరువ కావడం లేదు. అనేక ప్రాంతాల్లో ఇళ్ల పునాదుల వద్దే పనులు ఆగిపోవడం దీనికి నిదర్శనం.
ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోవడం లేదని, బిల్లులు సమయానికి రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని లబ్ధిదారులు చెబుతున్నారు. కొందరు గోడల దశ వరకు పనులు పూర్తి చేసినప్పటికీ, దాదాపు ఆరు నెలలు గడిచినా మొదటి బిల్లు కూడా రాకపోవడంతో నిర్మాణాలు ఆపేశారు. దీంతో అధికారులు ఇళ్లను రద్దు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. 15 రోజుల్లో పనులు తిరిగి మొదలు పెట్టాలని, లేనిపక్షంలో ఇళ్ల కేటాయింపులను రద్దు చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు.
Read Also: AP: 13 జిల్లాలకు ఆర్టీజీఎస్ సెంటర్లు..
సహాయం తక్కువ – లంచాలు ఎక్కువ? (Indiramma illu update) :
పథకం ప్రకారం, ఇల్లు మంజూరు అయిన 45 రోజుల్లో పని మొదలుకావాల్సింది. పని పురోగతిని ఆన్‌లైన్‌లో ఫోటో రూపంలో అప్లోడ్ చేస్తే, వారంలోపు డబ్బులు ఖాతాలో పడాలి. కానీ ఈ ప్రక్రియలో ఎక్కడా సరైన అమలు కనిపించడం లేదు. మైదాన స్థాయి అధికారులు బిల్లులు పాస్ చేయడానికి లంచాలు కోరుతున్నారని, లంచం ఇవ్వకుంటే ఫోటోలు అప్‌లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టుతున్నారని లబ్ధిదారుల ఆరోపణ.

లబ్ధిదారులే ఇళ్లు వదులుకుంటున్న స్థితి :
ప్రభుత్వం ఆర్థిక సహాయం సరిపోకపోవడంతో, కొందరు లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఇళ్లను వద్దని చెబుతూ దరఖాస్తులు చేస్తున్నారు. అయితే హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ప్రకారం – లబ్ధిదారుల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. (Indiramma illu update) అలాగే, జన్‌ధన్ ఖాతాదారులు చెల్లింపులు ఆలస్యమవుతున్నందున బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :