ప్రపంచ చెస్ ప్రియులందరూ ఎదురుచూస్తున్న FIDE చెస్ వరల్డ్ కప్ నేడు గోవాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీ నవంబర్ 27 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని 60కిపైగా దేశాల నుంచి మొత్తం 206 మంది అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. భారతదేశం రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. చివరగా 2002లో చెన్నైలో జరిగిన వరల్డ్ కప్‌ను భారత లెజెండరీ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గెలుచుకున్నారు. ఆ స్మృతిని గుర్తు చేసుకుంటూ ఈసారి ట్రోఫీకి “ఆనంద్ ట్రోఫీ” అని పేరు పెట్టడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
Jubilee Hills Bypoll : బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం – రేవంత్
ఈ టోర్నీలో భారత తరఫున ఆర్. ప్రజ్ఞానంద, డి. గుకేశ్, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతి వంటి యువ గ్రాండ్‌మాస్టర్లు పాల్గొననున్నారు. వీరంతా ప్రపంచ చెస్ రంగంలో కొత్త తరం ప్రతిభను ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ప్రజ్ఞానంద, గుకేశ్ లు వరుసగా వరల్డ్ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్‌తో ఆడిన అద్భుత గేమ్స్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈసారి తమ సత్తాను మళ్లీ చాటుకోవడానికి వీరంతా సన్నద్ధమయ్యారు. భారత జట్టు ప్రదర్శనపై దేశవ్యాప్తంగా చెస్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇక మరోవైపు, ఈసారి టోర్నీలో ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్, అమెరికన్ స్టార్ ఫాబియానో కరువానా, హికారు నకమురా వంటి ప్రముఖులు పాల్గొనకపోవడం గమనార్హం. దీంతో యువ ఆటగాళ్లకు టైటిల్ దక్కించే అవకాశాలు మరింతగా పెరిగాయి. FIDE ప్రతినిధుల ప్రకారం, ఈ టోర్నీ ద్వారా భవిష్యత్తు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి అర్హత పొందే ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. గోవా వేదికగా చెస్ క్రీడకు ప్రపంచ దృష్టిని మళ్లించిన ఈ ఈవెంట్, భారత్ చెస్ శక్తిగా ఎదుగుతున్న ప్రతీకగా నిలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/