हिन्दी | Epaper

News Telugu: AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల జైలు

Rajitha
News Telugu: AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల జైలు

AP Crime: చిత్తూరు: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటా నని మోసం చేసి పలుమార్లు అత్యాచారం (Rape) చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానాను విధిస్తూ గురువారం చిత్తూరు ఫోక్సో కోర్టు తీర్పువెలువరించింది. పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి(31) పిటిఎం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. 29 నవంబరు 2023 కంటే ముందే పూలా నరేంద్రరెడ్డి మైనర్ బాలికపై పలుమార్లు లైంగికంగా దాడిచేశాడు.

Read also: Mother Kills Son : డబ్బు కోసం కన్నకొడుకునే హత్య చేసిన తల్లి

AP Crime: 'పోక్సో' కేసులో 20 యేళ్ల జైలు

AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల జైలు

AP Crime: ఆపై పూలా నరేంద్రరెడ్డి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం కాదని తేల్చి చెప్పడంతో ఆ మైనర్ బాలిక తాను మోసపోయానని గ్రహించి తండ్రితో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్కు వచ్చి 29 నవంబర్ 2023న ఫిర్యాదు చేసింది. అప్పట్లో మదనపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో ఈకేసు దర్యాప్తు చేసి చిత్తూరు ఫోక్సో కోర్టులో (pocso court) చార్జీషీటు దాఖలుచేశారు. చిత్తూరు ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఎం.శంకర్రావు ఈ కేసు విచారణ పూర్తి చేసి గురువారం తీర్పు వెల్లడించారు. ఈకేసుకు సంబంధించి నిందితుడు పూలా నరేంద్రరెడ్డి పై నేరారోపణ నిజం కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం తరపున చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870