Health Alert: తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. అనేక ప్రాంతాలు వర్షాలు, వరదలతో నీటమునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు. తుఫాన్ తర్వాత నీటి మూలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున, తప్పనిసరిగా వేడిచేసిన నీటినే తాగాలని ప్రజలను హెచ్చరించారు. వర్షాలు తగ్గిన తర్వాత కూడా మలేరియా (Malaria) , డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అలాగే నీటిలో మునిగిన ఆహారం, పండ్లు, కూరగాయలు వాడరాదని చెప్పారు.
Read also: Beetroot: పిల్లల ఆరోగ్యానికి బీట్‌రూట్ ఎందుకు అవసరం?

Health Alert:
Health Alert: ఇక కొన్నిచోట్ల పారిశుద్ధ్య పనులు ఆలస్యమవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకుని, క్లీనింగ్ డ్రైవ్‌లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం, శుభ్రమైన ఆహారం, నీటిని మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: