ఆస్ట్రేలియా యువ క్రికెటర్ కేవలం 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ (Ben Austin) ప్రాక్టీస్ సెషన్‌లో బంతి తగిలి మృతి చెందాడు.. మెల్‌బోర్న్‌లోని ఒక స్థానిక మైదానంలో జరిగిన ఈ ఘటన ఆస్ట్రేలియా క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. సాధారణ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్న సమయంలో బెన్ ఆస్టిన్ (Ben Austin) మెడ భాగానికి బంతి బలంగా తాకింది.
Read Also: Women s World Cup 2025: నేడు భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్

వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినా, వైద్యులు చికిత్స అందించేలోపే అతడు మృతిచెందినట్లు ప్రకటించారు. అతడి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా పదకొండేళ్ల క్రితం ఆసీస్ బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ కూడా బంతి తాకి ప్రాణాలు కోల్పోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: