हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Women s World Cup 2025: నేడు భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్

Anusha
Latest News: Women s World Cup 2025: నేడు భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025 (Women s World Cup 2025) లో అసలైన సమరానికి వేదిక సిద్ధమైంది. గువాహటిలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో 125 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

Read Also: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ శతకం, బౌలర్ల ఘాటైన దాడితో ఆ జట్టు సత్తా చాటగా, ఇప్పుడు అందరి చూపు రెండో సెమీఫైనల్‌పై పడింది. ఈరోజు నవీ ముంబై వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు తలపడనున్నాయి. ఈ పోరు ఫైనల్‌ స్థానం కోసం జరుగుతున్నందున అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Women s World Cup 2025
Women s World Cup 2025

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను అదే రోజు పూర్తి చేయడానికి నిర్వాహకులు చివరి వరకు ప్రయత్నిస్తారు. ఫలితం కోసం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళుతుంది

నేడు ఆట సాధ్యం కాకపోతే, రేపు (శుక్రవారం) రిజర్వ్ డే రోజున మ్యాచ్‌ను కొనసాగిస్తారు.రెండు రోజులూ వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోతే మాత్రం గ్రూప్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఈ లెక్కన గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళుతుంది. నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870