TTD: గోవుల మృతిపై – టిటిడి (TTD) మాజీ ఛైర్మన్ భూమనను ప్రశ్నించిన డిఎస్పీ తిరుమల : ఎంతో పవిత్రమైన గోమాతలు టిటిడి గోశాలలో మృతిచెందాయనే ఆరోపణలపై మీవద్ద ఆధారాలు ఉంటే ఇవ్వాలని టిటిడి మాజీఛైర్మన్, వైసిపి ఉమ్మడిజిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డిని తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం ప్రశ్నించారు. ఏప్రిల్లో మీడియాతో గోవులు అధికంగా మృతి చెందాయని ఫోటోలతో మీడియాతో మాట్లాడిన అంశంపై టిటిడి బోర్డు సభ్యుడు ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసులో భూమన కరుణాకర్రెడ్డిని (Bhumana karunakar reddy) గురువారం ఉదయం తిరుపతి ఎస్వీయూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులిచ్చారు. ఉదయం 11గంటలకు పార్టీ శ్రేణులతో కలసి ప్రదర్శనగా భూమన స్టేషన్కు వచ్చారు. పార్టీ న్యాయవాదితో కలసి వచ్చిన ఆయనను అక్కడ డిఎస్పీ భక్తవత్సలం కొన్ని ప్రశ్నలను కరుణాకర్రెడ్డికి సంధించి సమాధానాలు రాబట్టారనేది తెలుస్తోంది.
Read aslo: AP: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ

TTD: మీ వద్ద ఆధారాలు ఉంటే ఇవ్వండి: డిఎస్పీ
గోవుల మృతిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, గోవులు అధికంగా మరణిస్తున్నాయని మాట్లాడానని తెలిపినట్లు సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆయన్ను పంపివేశారు. అయితే దీనిపై భూమన కరుణాకర్రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. టిటిడి బోర్డు గోవుల పట్ల నిర్లక్ష్యం తగదని, గోవులు మరణిస్తున్నాయని తెలిపానన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారని అసహనం చెందారు. ఇప్పటివరకు తాను చేసిన ఆరోపణలపై ఏ ఒక్క ఆరోపణలు తేల్చింది లేదన్నారు. వాస్తవాలు చెబుతుంటే నిందారోపణలు చేస్తున్నారని, తనపై విషప్రచారం చేస్తున్నారన్నారు. టిటిడిలో పనిచేసే వారికి తనపై నమ్మకం, గౌరవం వుందని, టిటిడి ఉద్యోగులతో ఒకరకమైన బాండింగ్ ఉందన్నారు.
గోవుల మృతిపై ఎవరిని ప్రశ్నించారు?
టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని డిఎస్పీ భక్తవత్సలం ప్రశ్నించారు.
ఈ విచారణ ఎందుకు జరిగింది?
టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని భూమన చేసిన ఆరోపణలపై విచారణ జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: