పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee ) ఆలయాల నిర్మాణాలపై దృష్టిసారించారు. దిఘాలోని జగన్నాథ ఆలయం, కోల్‌కతా సమీపంలోని రాజర్‌హట్‌లో ప్రతిపాదిత దుర్గా ఆలయ నిర్మాణం తర్వాత సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. గురువారం డార్జిలింగ్‌లోని మహాకాల్ ఆలయాన్ని మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మమతా బెనర్జీ (Mamata Banerjee ) మాట్లాడారు. ‘సిలిగురిలోని ప్రతిపాదిత కన్వెన్షన్ సెంటర్ పక్కన పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం. పెద్ద శివలింగం ఉన్న అతిపెద్ద మహాకాళ ఆలయం ఇది. ఈ గుడి కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఆలయానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.

కాగా, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్పందించారు. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee )ని ఆయన విమర్శించారు. ‘2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు హిందువులు ఓటు వేయరని, బీజేపీకే వారు ఓటు వేస్తారని ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు. అందుకే ఆమె జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.
మమతా బెనర్జీ ఏ కళాశాలలో చదువుకున్నారు?
1970లో, బెనర్జీ దేశబంధు శిశు శిక్షాలయ నుండి హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్ష పూర్తి చేశారు. ఆమె జోగమయ దేవి కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
కలకత్తా ముఖ్యమంత్రి ఎవరు?
2011 మే 20న ప్రమాణ స్వీకారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళ. ఆ తర్వాత 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక మహిళగా కొనసాగుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: