Israel: ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు కీలక పాత్ర పోషించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు (Trump) ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘన సత్కారం అందించింది. జెరూసలెంలో ట్రంప్ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ కనెసెట్ సభ్యులు లేచి నిలబడి ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, “గాజా యుద్ధం నిలిపి శాంతి దిశగా ట్రంప్ చూపిన మార్గం విశేషం. బందీల విడుదలకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది” అన్నారు. అలాగే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని అభిప్రాయపడ్డారు.
Donald Trump : ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో అమెరికా అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!

Israel
ఇజ్రాయెల్ Israel స్పీకర్ ఓహనా కూడా ట్రంప్‌ను ప్రశంసిస్తూ, “యూదు ప్రజలు ఆయనను తరతరాల పాటు గుర్తుంచుకుంటారు. శాంతి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిగా ఆయన నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు (Netanyadu) ప్రభుత్వం ట్రంప్ పేరును 2026 నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించనున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌ను సత్కారంగా గుర్తుచేస్తూ బంగారు పావురాన్ని కానుకగా అందజేశారు. ట్రంప్ స్పందిస్తూ, “ఇజ్రాయెల్ israel ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటుంది. ప్రపంచంలో శాంతి సాధనకు ఇది ఆరంభం మాత్రమే” అని తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం డోనాల్డ్ ట్రంప్‌ను ఎందుకు సత్కరించింది?
ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించినందుకు ఆయనను సత్కరించింది.
ట్రంప్‌కు ఇజ్రాయెల్ చట్టసభ కనెసెట్ ఎలా సత్కారం అందించింది?
జెరూసలెంలో జరిగిన సభలో కనెసెట్ సభ్యులు లేచి నిలబడి రెండు నిమిషాల పాటు చప్పట్లతో ట్రంప్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: