జూబ్లీహిల్స్‌లో పోరు చెలరేగింది: కేటీఆర్ వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్‌లో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, నిజం మరియు ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. రహమత్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన, “హైదరాబాద్ (Jubilee hills) ప్రజలు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాగా తెలుసుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు” అని గుర్తుచేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ గెలిపించిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
Read also: కూటమి ప్రభుత్వంఫై అమరావతి రైతుల అసంతృప్తి

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు
కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేరు” అని విమర్శించారు. అజారుద్దీన్ టిక్కెట్ విషయంలో మోసం జరిగిందని, ఎమ్మెల్సీ హామీ కూడా నిలబడదని చెప్పారు. షేక్‌పేట కబరస్థాన్ స్థలం, బీసీ రిజర్వేషన్లు — అన్నీ కోర్టులో నిలబడలేదని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానమని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ (Jubilee hills) ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబితే, ఢిల్లీ అధిష్ఠానం కూడా దిగ్భ్రాంతికి గురవుతుందని వ్యాఖ్యానించారు. మహిళలు ఇప్పుడు దుర్గాదేవిలా కాంగ్రెస్‌కు గట్టి సమాధానం ఇస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించిందని ఆరోపిస్తూ, ఒక ఇంట్లో 43 ఓట్లు నమోదు చేశారని విమర్శించారు. పెన్షన్ పెంపు, మహిళలకు నెలకు ₹2,500, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు కాంగ్రెస్ నెరవేర్చలేదని పేర్కొంటూ, “ఇవి అన్నీ కాంగ్రెస్ బాకీలు” అని కేటీఆర్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: