ఉదయం నిద్రలేవగానే అలసటగా, బలహీనంగా అనిపించడం చాలా మందికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ వైద్యుల ప్రకారం ఇది కేవలం నిద్ర లోపం లేదా శారీరక ఒత్తిడి కారణం కాకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. రాత్రంతా విశ్రాంతి తీసుకున్నప్పటికీ, ఉదయం శరీరం భారంగా అనిపించడం, కళ్ళు తెరవడం కష్టంగా అనిపించడం, శక్తి లేకపోవడం వంటి లక్షణాలు శరీరంలో ఏదో అసమతుల్యత జరుగుతోందని సంకేతాలు. ముఖ్యంగా, ఇది డయాబెటిస్ (షుగర్ వ్యాధి) ప్రారంభ లక్షణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
రాశి ఫలాలు – 13 అక్టోబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
వైద్యుల వివరాల ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయి (Blood Sugar Level) ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్‌ను ఎనర్జీగా మార్చే ప్రక్రియ మందగిస్తుంది. ఫలితంగా శరీరానికి కావలసిన శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. షుగర్ స్థాయి పెరగడం వలన ఉదయం లేవగానే గొంతు ఎండిపోవడం, తలనొప్పి, కంటిచూపు మందగించడం, చేతులు, కాళ్లు భారంగా అనిపించడం, మరియు తరచుగా మూత్ర విసర్జన అవసరం అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది ఈ సూచనలను నిర్లక్ష్యం చేయడంతో, డయాబెటిస్ ముందుకు వెళ్లి తీవ్రమైన దశకు చేరే ప్రమాదం ఉంటుంది.

ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, మరియు తగినంత నీరు తాగడం ద్వారా షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. అదేవిధంగా నిద్రపాటు సరైన సమయానికి ఉండటం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండకపోవడం కూడా ఆరోగ్యానికి ఉపయోగకరం. వైద్యుల పర్యవేక్షణలో ఉండడం ద్వారా డయాబెటిస్‌ను మొదటి దశలోనే గుర్తించి నియంత్రించడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం అలసటను సాధారణంగా తీసుకోవకుండా, దానిని ఒక ఆరోగ్య సంకేతంగా గుర్తించి చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/