हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Gst : చేనేతకు అక్కరకు రాని జిఎస్టి

Sudha
Latest Telugu news : Gst : చేనేతకు అక్కరకు రాని జిఎస్టి

మన దేశంలో చేనేత పరిశ్రమ అత్యంత పురాతనమైన వృత్తి. దీనిని దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తిస్తారు.
వ్యవసాయ రంగం తరు వాత దేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆధారపడ్డ రంగం చేనేత రంగం.
ముఖ్యంగా, ఎక్కువ మంది మహిళలు ఆధారపడ్డ రంగం ఇది. గ్రామీణ మహిళా సాధికారతకు అండ గా నిలిచేదిచేనేత రంగం మాత్రమే చేనేత పరిశ్రమ మీద ఆధారపడి దేశం లో కొన్ని లక్షల మంది జీవనం సాగిస్తు న్నారు.2019-20 జాతీయ హ్యాండ్లూమ్ సెన్సస్ ప్రకారం సుమారు 26,73, 891 మంది నేతకార్మికులు మన దేశంలోఉన్నారు. వారిలో 88.7 శాతం గ్రామీణ ప్రాంతాలవారు కాగా 11.3 శాతం పట్టణ ప్రాంతానికి చెందినవారు.మొత్తం చేనేత కార్మికుల లో 71.6 శాతం మహిళలు, 28.4 శాతం పురుషులు. సుమారు 2,10,751 మందిపరోక్షంగా ఈ రంగంపై ఆధా రపడి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువే. తెలంగాణలో సుమారు 27,916 కుటుం బాలు చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 19, 417 కుటుంబాలు, పట్టణ ప్రాంతాలలో 8,499 కుటుంబాలు చేనేత వృత్తినే నమ్ముకున్నాయి. అలా గే, ఆంధ్రప్రదేశ్లో 1,22,644 కుటుంబాలు ఉండగా, గ్రామీ ణ ప్రాంతాలలో 77,065, పట్టణ ప్రాంతాలలో 45,579 చేనేత కుటుంబాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పోచంపల్లి, గద్వాల్, ఉప్పాడ, వేంకటగిరి మంగళగిరి ధర్మవరం వంటి ప్రాంతాలు చేనేత వస్త్రాల తయారీకి పెట్టింది పేరు. అలాగే ఈ ప్రాంతాలలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సైతం కలిగివున్నాయి. దేశ వ్యాప్తంగా చేనేత వస్త్రాలు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కానీ ఇటీవల వస్తు సేవల పన్ను (జిఎస్టి)లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులలో భాగంగా చేనేత, టెక్స్టైల్ రంగంపై ఏకంగా 18 శాతం జిఎస్టిని విధించండంతో ఆయా రంగాల పై పెనుభారం పడనుంది. ఇప్పటికే 5శాతం జిఎస్టి (Gst)వలన చేనేత పరిశ్రమ భారీగా నష్టపోతోంది.

Gst : చేనేతకు అక్కరకు రాని జిఎస్టి
Gst : చేనేతకు అక్కరకు రాని జిఎస్టి

వినియోగదారులపై భారం

జిఎస్టి 20 లో చేనేత దుస్తులను 18 శాతం స్లాబ్లో చేర్చడంపై పరి శ్రమ వర్గాలే కాకుండా ఇటు వినియోగదారులు సైతం అస హనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 1000 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలపై 12 శాతం జిఎస్టి (Gst)ని విధిస్తున్నారు. నూతన జిఎస్టి మార్పులలో భాగంగా, 2500 రూపాయల కంటే తక్కువ ధర ఉండే వస్త్రాలపై 5 శాతం, 2500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే చేనేత, ఇతరవస్త్రాలపైఉన్న 12 శాతం జిఎస్టిని 18 శాతంకు పెంచారు. ఈ నెల 22 నుండి నూతన రేట్స్ అమలులోకివచ్చాయి. వాస్తవానికి, జిఎస్టి (Gst)మార్పులలో భాగంగా చేనేత వస్త్రాలపై పన్నును ఎత్తివేస్తారు అనిభావిం చినపరిశ్రమ వర్గాలకు జిఎస్టి టిని 12 శాతం నుండి 18 శాతంకు పెంచడం ఆశ్చర్యానికి గురి చేసింది. జిఎస్టిపెంపుతో దేశవ్యాప్తంగా చేనేత వస్త్రాల ధరలు పెరుగుతాయి. ఫలితంగా డిమాండ్ తగ్గి చేనేత పరిశ్రమకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నది. మొదటి నుండి చేనేత రంగానికి జీఎస్టీ భారంగా మారింది. 5శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది.

చేనేత వృత్తిని వదిలి

దేశంలో కొన్ని రాష్ట్రాలు ముడి సరుకుపై సబ్సిడీని, చేనేతవస్త్రాలపై జిఎస్టి పన్ను భారాన్ని భరించడానికి ముందుకు వచ్చినప్పటికీ దేశవ్యాప్తం గా చేనేత కార్మికులు,సంఘాలు, పరిశ్రమ పన్నుల భారం తో నష్టాలు ఎదుర్కుంటున్నారు. చేనేత కార్మికులు చేతితో తయారు చేసేవస్త్రాలు భారతీయ సంస్కృతి సంప్రదాయా లకు ప్రతిబింబాలు. చేనేత వస్త్రాలను తయారు చేయడం అంతసులభమైన ప్రక్రియకాదు. ఒక్కో చీరను తయారు చేయడానికి సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. సహజ సిద్ధమైన దారాలు, రంగులు వంటి ఇతర ముడిసరుకులను ఉపయోగించి భారతీయత కనిపించేలా చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. అయితే గత కొన్నేళ్లుగా, మార్కెట్లో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా వస్త్రాలధరలు పెంచడం ద్వారా 5 శాతం స్లాబ్ నుండి 12 శాతం స్లాబ్లోకి రావడంతో పన్నుభారం పెరిగి, ధరలు పెరిగి వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ లేకుండా పోతుంది. ఫలితంగా ఆదాయం లేక ఇప్పటికే చాలా కుటుం బాలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులను ఎంచుకుంటు న్నారు. ఇక ప్రస్తుత 12శాతం నుండి 18 శాతానికి జిఎస్ టి పెంచడంతో రానున్న రోజుల్లో చేనేత పరిశ్రమ మరింత నష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే, చేనేత వృత్తి లాభ దాయకం కాకపోవడంతో యువత ఈ రంగాన్ని ఎంచుకోవ డంలేదు.

Gst : చేనేతకు అక్కరకు రాని జిఎస్టి
Gst : చేనేతకు అక్కరకు రాని జిఎస్టి

మరిన్నినష్టాలు

భవిషతో పన్నులు పెరగడంతో చేనేత వస్తువు లకు ధరలు పెరిగి, మార్కెట్లో డిమాండ్ పడిపోయి మరిం త నష్టాలు రావడం. తద్వారా చేనేత పరిశ్రమ కనుమరు గయ్యే అవకాశాలు లేకపోలేదు. కార్మికుడి శ్రమతో యంత్రాలు ఉపయోగించకుండా, చేతులతో తయారు చేసే చేనేత ఎంతో మన్నికైనవి. సహజ సిద్ధమైన ముడి సరుకుల ధరకూడా అధికం. ఎంతో కష్టంతో కూడుకుని ఉన్న చేనేత వస్త్రాలు 2500రూపాయల కంటే తక్కువ ధరతో మార్కెట్లో అమ్మడం సాధ్యమేనా? దేశంలో పేరొందిన పోచంపల్లి, కంచి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ వంటి ఇతర చేనేత వస్త్రాలు కేవలం 2500 రూపాయలకు మార్కెట్లో దొరుకుతాయా? కొత్త జిఎస్టి ప్రకారం 2500 పైనధర ఉండే వస్త్రాలపై 18 శాతం పన్ను విధింపపడతాయి. అంటే, భవి ష్యత్లో ముడిసరుకు, ఇతర కారణాలతోచేనేత వస్త్రాల ధర లు పెరగక తప్పదు. ఫలితంగా, 5 శాతం పన్ను నుండి 18 శాతం పన్ను స్లాబ్లోకిరావడంతో ధరలు పెరిగి ఆ భారం వినియోగదారుని మీద పడుతుంది. అప్పుడు చేనేత వస్త్రాలకు మార్కెట్లోకొనుగోలు తగ్గి వాటి మీద ఆధార పడ్డ చేనేత కార్మికులకు నష్టాలు వస్తాయి. గమనించదగ్గ విషయంఏమిటంటే, చేనేత వస్త్రాలపై జిఎస్టిని 18 శాతా నికి పెంచిన కేంద్రం, ఎటువంటి శ్రమ లేకుండా కృత్రిమదారాలతో, యంత్రాల సహాయంతో తయారు చేసే పాలిస్టర్ వంటి వస్త్రాలపై జిఎస్టీని 12 శాతం నుండి ౫ శాతంకు తగ్గించింది. యంత్రాల సహాయంతో తయారు చేసిన వస్త్రా లు తక్కువ ధరలకు లభించడంతో
వినియోగదారులు వాటి పై మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా చేనేత పరిశ్రమకు మరింత నష్టాలు
|తప్పవు. నిజానికి చేనేత వస్త్రా లు విలాసవంతమైన వస్తువులు కావు. అవి సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా, లక్షలాది మందికి జీవనోపాధి. అలాంటి వస్తువులపై జిఎస్టిని తీసివేయాలి. లేదా ధరల సీలింగ్లిమిట్ను పెంచాలి. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. వోకల్ ఫర్ లోకల్, స్వదేశంలోనే ప్రతి వస్తువును
తయారు చేయాలంటూ ‘మేక్ ఇన్ ఇండియా’. ఆత్మనిర్బర్ భారత్ వంటి పథకాలకు శ్రీకారంచుట్టింది కేంద్ర
ప్రభుత్వం. కానీ స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చేనేత వస్త్రాలపై 18 శాతం జిఎస్టి విధించడం
సరికాదు. జిఎస్టి పెంపు ద్వారా చేనేత రంగంపై ఆధార పడ్డ కార్మికుల జీవనోపాధిని దూరం చేయడమే
కాకుండా శతా బ్దాలుగా వారసత్వ సంపదగా వస్తున్న చేనేత సంస్కృతిని అడ్డుకోవడమే. ఒకవిధంగా ఈ
నిర్ణయంతో గ్రామీణ జీవన విధానాలలో భాగమైన చేనేత వృతి కనుమ రుగవడం కాయం.
-డాక్టర్ రామకృష్ణ బండారు

చేనేత ఉత్పత్తులపై GST ఎంత?

చేనేత ఉత్పత్తులకు వస్తువులు మరియు సేవల పన్ను (GST) రేటు మారుతూ ఉంటుంది కానీ కాటన్ చీరలు, పట్టు చీరలు మరియు చేతితో నేసిన కార్పెట్‌లు వంటి అనేక వస్తువులకు తరచుగా 5% ఉంటుంది. అయితే, కాటన్ టెర్రీ టవలింగ్ లేదా కిచెన్ లినెన్ వంటి ఇతర చేనేత వస్తువులపై 12% పన్ను విధించవచ్చు. నిర్దిష్ట రేటు ఉత్పత్తి యొక్క HSN (హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్‌క్లాచర్) కోడ్ మరియు దాని విలువపై ఆధారపడి ఉంటుంది, ₹1,000 కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ దుస్తులు మరియు పాదరక్షలకు సాధారణ వ్యత్యాసం ఉంటుంది, ఇక్కడ ₹1,000 కంటే తక్కువ దుస్తులు 5% రేటును మరియు అంతకంటే ఎక్కువ 12% రేటును ఆకర్షిస్తాయి.

చీరలపై GST అంటే ఏమిటి?

కాటన్ చీరలకు HSN కోడ్ 520859, ఇది 85% లేదా అంతకంటే ఎక్కువ బరువున్న పత్తి నేసిన బట్టల కిందకు వస్తుంది. దీనికి 5% GST రేటు వర్తిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870