
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ఎప్పుడూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik Movie), రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా విధి నటిస్తోంది.
Rukmini Vasant: రుక్మిణి వసంత్ కుటుంబ నేపథ్యం తెలుసా?
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ (Teaser) ను విడుదల చేశారు. యూత్ ఫుల్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. రొటీన్ స్టోరీ అనిపిస్తోంది. చాన్నాళ్లుగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న శౌర్య.. ప్లాప్స్ వస్తున్నా మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది.
(Bad Boy Karthik Movie) సినిమాలో సాయి కుమార్ (Sai Kumar) పోలీస్ పాత్రలో కనిపించగా.. సముద్రఖని, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఇతర పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ (Harris Jayaraj) సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి ఫిలిమ్స్ నిర్మిస్తోంది.
రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: