తక్కువ వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్) బారినపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీ హెల్త్‌కి చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ఒక ముఖ్యమైన అంశాన్ని బయటపెట్టింది.
Read Also: Tirupati: అత్త-అల్లుడి సంబంధం: అడ్డుకున్న కూతురిపై దాడి

ధ్యయనంలోని ముఖ్య విషయాలు
పరిశోధన ప్రకారం — 50 ఏళ్లలోపు వయసున్న వ్యక్తుల్లో మలద్వారం నుంచి రక్తస్రావం (Rectal Bleeding) కనబడితే, అది పెద్దపేగు క్యాన్సర్‌కు అత్యంత బలమైన సంకేతం కావచ్చని తేలింది.
ఈ లక్షణం ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతరులతో పోలిస్తే 8.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
లూయిస్‌విల్లే యూనివర్సిటీ హెల్త్ పరిశోధక బృందం 2021–2023 మధ్య 50 ఏళ్లలోపు 443 మంది రోగుల కొలొనోస్కోపీ రిపోర్టులను(Reports) విశ్లేషించింది. వీరిలో సగానికి పైగా చిన్న వయసులోనే క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. క్యాన్సర్ ఉన్నవారిలో 88 శాతం మంది మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలతో డాక్టర్లను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు ప్రకారం కుటుంబ చరిత్ర లేనివారు 45 ఏళ్ల వయసు నుంచే స్క్రీనింగ్ చేయించుకోవాలి. కానీ ఈ అధ్యయనం ప్రకారం, మలంలో రక్తం లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనబడితే వయసుతో సంబంధం లేకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కొలొరెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటి?
పెద్దపేగు లేదా మలద్వారం ప్రాంతంలో కణజాలం అసాధారణంగా పెరగడం వలన ఏర్పడే క్యాన్సర్‌ను కొలొరెక్టల్ క్యాన్సర్ అంటారు.
ఈ వ్యాధికి ప్రారంభ లక్షణాలు ఏవి?
మలంలో రక్తం కనిపించడం, బరువు తగ్గడం, జీర్ణ సమస్యలు, మల విసర్జనలో మార్పులు మొదలైనవి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: