हिन्दी | Epaper

Latest News: IND vs WI: నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్ తో ఫిదా అయినా నెటిజన్లు

Anusha
Latest News: IND vs WI: నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్ తో ఫిదా అయినా నెటిజన్లు

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తన అద్భుతమైన ఫీల్డింగ్ ప్రతిభతో క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్దులను చేసాడు..అతని ఫీల్డింగ్ విన్యాసానికి విండీస్ ఓపెనర్ త్యాగనరైన్ చందర్‌పాల్(8) నిరాశగా పెవిలియన్ చేరాడు.

Henry Thornton: ఆసుపత్రిలో చేరిన క్రికెటర్‌ హెన్రీ థోర్న్‌టన్..కారణమిదే?

సిరాజ్ (Siraj) బౌలింగ్‌లో చందర్ పాల్ కొట్టిన బంతిని స్క్వేర్ లెగ్‌లో పక్షిలా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. మరో ఓపెనర్ కాంప్‌బెల్‌ను జడేజా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 24 పరుగులకే వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో అలిక్ అథనాజే(3 బ్యాటింగ్), బ్రాండన్ కింగ్(1 బ్యాటింగ్) ఉన్నారు.

మరో 8 వికెట్లు తీస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్ తరహాలో భారత బౌలర్లు చెలరేగితే ఈ రోజే ఫలితం రానుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది.

జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లు పడగొట్టాడు.

కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా..

కెప్టెన్ శుభ్‌మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(2/90) రెండు వికెట్లు తీయగా.. జైడన్ సీల్స్, వారికన్, పిర్ తలో వికెట్ తీసారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

టీ20 వరల్డ్‌కప్ విజయం- బుమ్రా గొప్పతనం చెప్పిన సూర్య

టీ20 వరల్డ్‌కప్ విజయం- బుమ్రా గొప్పతనం చెప్పిన సూర్య

వరల్డ్ కప్ గెలుపు వెనుక వాళ్లే- గౌతమ్ గంభీర్

వరల్డ్ కప్ గెలుపు వెనుక వాళ్లే- గౌతమ్ గంభీర్

విషాదాన్ని జయించిన ఇషాన్, హాఫ్ సెంచరీతో భారత్ విజయం

విషాదాన్ని జయించిన ఇషాన్, హాఫ్ సెంచరీతో భారత్ విజయం

📢 For Advertisement Booking: 98481 12870