రాష్ట్రంలోని దళితవాడల్లో టీటీడీ నిధులతో 5,000 ఆలయాలను (5,000 temples) నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.షర్మిల మాట్లాడుతూ, చంద్రబాబు బీజేపీ వైఖరిని పూర్తిగా స్వీకరించారని మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదిగా మారారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులుగా ఆర్ఎస్ఎస్ ఆలోచనలను అమలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. లౌకిక రాజ్యంలో ఒకే మతానికి ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదని స్పష్టం చేశారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రకటించారు.

దళితవాడల్లో గుళ్లు ఎందుకు?
దళితవాడల్లో 5,000 గుళ్లు నిర్మించాలని ఎవరు కోరారు? అని షర్మిల నేరుగా ప్రశ్నించారు. టీటీడీ వద్ద అధిక నిధులు ఉంటే, వాటిని దళితుల అభివృద్ధికి ఎందుకు ఉపయోగించరని నిలదీశారు. మహిళా సంక్షేమ హాస్టళ్లలో వసతుల కొరతను ఇటీవల హైకోర్టు గుర్తుచేసిందని ఆమె అన్నారు. గుళ్ల నిర్మాణానికి బదులుగా ఆ నిధులను హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని సూచించారు.
దళితుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచన
ఆలయాలు నిర్మించినా, వాటిలో పూజారులుగా ఎవరు ఉంటారని ప్రశ్నించారు. బ్రాహ్మణులనేగా నియమిస్తారని, దళితులకు ఆ అవకాశం కల్పిస్తారా అని షర్మిల సూటిగా డిమాండ్ చేశారు. దళితులపై నిజమైన ప్రేమ ఉంటే, వారి అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వడం ద్వారా చంద్రబాబు బీజేపీతో కలిసిపోయారని షర్మిల ఆరోపించారు. ఇప్పుడు ఆయన చేసే ప్రతి నిర్ణయంలో అదే తీరుపై నడుస్తున్నారని విమర్శించారు.5000 ఆలయాల నిర్మాణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ నిధులను దళితవాడల సమగ్రాభివృద్ధికి కేటాయించాలని షర్మిల స్పష్టం చేశారు.
Read Also :