हिन्दी | Epaper

Bathukamma 2025 : టీజీ ఎస్‌పీడీసీఎల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Sudheer
Bathukamma 2025 : టీజీ ఎస్‌పీడీసీఎల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టీజీ ఎస్‌పీడీసిఎల్‌ లో బతుకమ్మ (Bathukamma) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ మింట్ కంపౌండ్ లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు పర్యావరణం, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగాను, సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ , ఐఏఎస్ గౌరవ అతిధులుగాను పాల్గొని బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని ఎలక్ట్రిసిటీ ఉమెన్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ, జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎం. తులసి నాగరాణి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి పొన్నం సారధ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన విషయాన్ని మరువరాదన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో మహిళలు ప్రయాణాలు సాఫిగా సాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లోనూ మహిళలకు పెద్ద పీట వేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.

కాగా ఈ కార్యక్రమంలో పలువురు మహిళా ఉద్యోగినులు పాల్గొని భక్తి శ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేసి సంతోషంగా ఆడి పాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎం. తులసి నాగరాణి తో పాటు సంస్థ డైరెక్టర్లు శివాజీ, డా. నరసింహులు, చక్రపాణి, కృష్ణా రెడ్డి, సీజీఎంలు సుధా మాధురి, శోభారాణి, మహిళా సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రసిడెంట్‌ టీ. కవిత, ఫైనాన్స్‌ సెక్రటరీ కె.లత, ఉపాధ్యక్షురాలు మంగమ్మ , సత్యమ్మ , ఇతర ఉద్యోగినులు పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870