ఉదయం లేవగానే చాలామందికి కాఫీ లేదా టీ తప్పనిసరి. వీటిలో ఉపయోగించే పాలు మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందిస్తాయి. పాలను మనం పన్నీర్, జున్ను, వెన్న, షేక్స్, ఐస్‌క్రీమ్ వంటి అనేక రూపాల్లో తీసుకుంటూ ఉంటాం. పాలలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు శరీరానికి పోషకాలను(Nutrients) అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇప్పుడు ప్రతిరోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
ఎముకలు బలపడటానికి
పాలలో ఉండే కాల్షియం, విటమిన్ D, ప్రోటీన్ ఎముకలు మరియు కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోజూ పాలు తాగడం వలన ఎముకలు గట్టిగా మారి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు దూరమవుతాయి.

బరువు తగ్గడంలో తోడ్పాటు
పాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు సమతుల్యంగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. బ్రాంచ్‌డ్ చైన్ అమైనో ఆమ్లాలు (BCAA) కండరాల బలాన్ని పెంచుతాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి పాలు మంచి ఆహారంగా పరిగణించబడుతుంది.
డయాబెటిస్ మరియు గుండె ఆరోగ్యానికి
రోజూ పాలు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉన్న పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వలన రక్తపోటు, గుండె జబ్బులు(heart disease), స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
క్యాన్సర్ ప్రమాదంపై ప్రభావం
కొన్ని అధ్యయనాలు పాలలోని కాల్షియం కీమోప్రొటెక్టివ్ లక్షణాలతో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని చెబుతున్నాయి. అయితే అధిక పరిమాణంలో పాలు తాగడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని మరో అధ్యయనం సూచిస్తుంది. దీనిపై ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరం.
రోజూ పాలు తాగడం వలన ఎముకలకు లాభమా?
అవును, పాలలోని కాల్షియం, విటమిన్ D ఎముకలను బలపరుస్తాయి.
బరువు తగ్గడంలో పాలు సహాయపడతాయా?
అవును, పాలు కడుపు నిండిన భావన కలిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: