हिन्दी | Epaper

Breaking News – Accenture : వైజాగ్ కు మరో ప్రముఖ ఐటీ కంపెనీ?

Sudheer
Breaking News – Accenture : వైజాగ్ కు మరో ప్రముఖ ఐటీ కంపెనీ?

విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక అడుగు పడబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్(Accenture ) నగరంలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, విశాఖపట్నం భౌగోళిక స్థితి, నైపుణ్య వనరులు, ఐటీ వాతావరణం అభివృద్ధికి అనువుగా ఉండటంతో యాక్సెంచర్ ఇక్కడ కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించుకుందని సమాచారం.

ఆ ప్రతిపాదన ప్రకారం..సంస్థకు పది ఎకరాల భూమిని ఎకరాకు 99 పైసల లీజు చొప్పున కేటాయిస్తే, దాదాపు 12 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యాక్సెంచర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో యాక్సెంచర్ రాకతో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు విశాఖపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.

విశాఖపట్నం (Vizag) ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుంది. ముఖ్యంగా యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా అనుబంధ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, సేవారంగాలూ చురుకుగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పిస్తే విశాఖపట్నం దేశంలోని ప్రధాన ఐటీ నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకోవడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. యాక్సెంచర్ రాకతో ఈ కల నిజం కావడమే కాకుండా, నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

📢 For Advertisement Booking: 98481 12870