గాజులరామారం (Gajularamaram) కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం – ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతమైన గాజులరామారం ఆదివారం ఉద్రిక్త వాతావరణానికి కేంద్రబిందువైంది. (Hyderabad) ప్రభుత్వానికి చెందిన విలువైన భూములపై అనధికార నిర్మాణాలు జరిగాయని గుర్తించిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా), రెవెన్యూ అధికారులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఉదయం నుంచే పోలీసులు భారీ బందోబస్తు కల్పించగా, బుల్డోజర్లు రంగంలోకి దిగి అనధికార నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించాయి. ఈ చర్యలకు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇళ్లను కూల్చివేయొద్దని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
సర్వే నంబర్ 397 పరిధిలో ఉన్న సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి కొంతకాలంగా కబ్జాకు గురైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూమి విలువ మార్కెట్‌లో దాదాపు ₹4500 కోట్లు ఉంటుందని అంచనా. కబ్జాదారులు చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి, ఒక్కింటిని ₹10 లక్షల వరకు అమ్మినట్లు విచారణలో బయటపడింది. (Hyderabad) ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్, హైడ్రా అధికారులు శనివారం ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించాలన్న ఉద్దేశ్యంతో వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితంగా ఆదివారం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తమ ఇళ్లు కూల్చేస్తున్నారనే ఆవేదనతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని పక్కకు తప్పించడంతో అక్కడ టెన్షన్ Tention పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ అధికారులు ఆపరేషన్ కొనసాగిస్తూ, అక్రమ నిర్మాణాల తొలగింపులో నిమగ్నమయ్యారు.
గాజులరామారంలో ఉద్రిక్తత ఎందుకు నెలకొంది?
ప్రభుత్వ భూములపై నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడం ప్రారంభించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ కూల్చివేతల వెనుక ఎవరు ఉన్నారు?
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) రెవెన్యూ అధికారులతో కలిసి ఈ చర్యలు చేపట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: