మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పండ్లు ఎంత ముఖ్యమో, కొన్ని పండ్ల ఆకులు కూడా అంతే విలువైనవిగా ఉంటాయి. అటువంటి వాటిలో జామ ఆకులు (Guava Leaves) ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఈ రోజుల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి లోపించడం వల్ల జీర్ణ సమస్యలు బాగా పెరిగాయి. ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం ద్వారా జీర్ణక్రియ వేగంగా జరిగి, అమ్లపిత్తం, అజీర్ణం, కడుపునొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది పేగుల శుభ్రతకు కూడా తోడ్పడుతుంది.

మధుమేహం నియంత్రణలోకి వస్తుంది
డయాబెటిస్ (Diabetes) ఉన్నవారికి జామ ఆకులు చాలా సహాయపడతాయి. ఇవి శరీరంలోని ఇన్సులిన్ స్పందనను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ముఖ్యంగా జామ ఆకుల కషాయాన్ని ఉదయం తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
నోటి పూతలకు ఉపశమనం
నోటి పూతలు అసహనంగా మారతాయి. ఈ సమస్యను నివారించేందుకు జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే బాక్టీరియా నిరోధక లక్షణాలు పూతలపై పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో 2–3 సార్లు జామ ఆకులను నమలడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గించడంలో సహాయపడతాయి
ఒత్తిడి, దురహారపు అలవాట్ల వల్ల చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మెటబాలిజాన్ని (Fiber metabolism)మెరుగుపరచి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. జామ ఆకులతో టీ తయారు చేసి ఉదయం తాగడం మంచి పరిష్కారం.
చర్మ ఆరోగ్యానికి మంచిది
జామ ఆకులు చర్మ సంబంధిత సమస్యల నివారణకు సహాయపడతాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు ముడతలు, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీబాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని నిగారింపు, ఆరోగ్యంగా ఉంచుతాయి.జామ ఆకులను పక్కాగా శుభ్రంగా కడిగి, ఉదయం ఖాళీ కడుపుతో 2–3 ఆకులు నమలాలి. గమనించవలసిన విషయం ఏమంటే, దీన్ని మందుల స్థానంలో కాకుండా ఆరోగ్యపు సహాయక చర్యగా తీసుకోవాలి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: