RDT సంస్థను అనంతపురం పేదలకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై భగ్గుమన్న అనంత కలెక్టరేట్ ముట్టడి. ఇప్పటికైనా అనంతపురం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీ లు స్పందించాలి లేదంటే జనాగ్రహం తప్పదు అంటూ ధర్నాలు చేస్తున్న అనంతపురం ప్రజలు.
జనాగ్రహం : RDT కోసం కదం తొక్కిన ప్రజలు… రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా శక్తివంతమైన ఉద్యమం ప్రజాశక్తితో ముందుకు పోతుంది కేంద్రం దిగివస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం.చంద్రబాబు గారు అనంతపురం చుట్టుపక్కల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న RDT సంస్థను కూటమి ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయకుండా హింసిస్తున్నారు దీని వల్ల ప్రజలు నష్టపోతున్నారు అడుక్కున్నారు ఈ రోజు #SaveRDT అంటూ ఉద్యమంగా వచ్చారు..నెక్స్ట్ నేపాల్ లో లాగ యుద్ధం అవ్వకుండా చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు.

విసెంటే ఫెర్రర్, జర్నలిస్ట్ యాన్ పెర్రీతో పాటు మరో ఇద్దరు స్థానిక వాలంటీర్లు అనంతపురానికి వచ్చారు. వాళ్లు కొత్తగా స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా కరువు ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

RDT బత్తలపల్లి హాస్పిటల్ అనేది 360 పడకల సెకండరీ-లెవల్ ఆసుపత్రి, ఇది ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ వర్గాలకు నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి 2000లో విసెంటే ఫెర్రర్ చేత స్థాపించబడింది, ఇది విస్తృత శ్రేణి విభాగాలు మరియు ప్రత్యేక సేవలను అందిస్తుంది.
RDT బత్తలపల్లి ఆసుపత్రి గురించి ముఖ్య వివరాలు
- ఫౌండేషన్: ఈ ఆసుపత్రి 2000లో స్థాపించబడింది మరియు దీనిని విసెంటే ఫెర్రర్, అన్నే ఫెర్రర్ మరియు డాక్టర్ వై. బాల సుబ్బయ్య ప్రారంభించారు.
- సేవలు: ఇది 12 కంటే ఎక్కువ విభాగాలలో సమగ్రమైన సేవలను అందిస్తుంది, వాటిలో:
- జనరల్ మెడిసిన్
- జనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్ మరియు ట్రామాటాలజీ
- గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రం
- పీడియాట్రిక్స్ & నియోనాటాలజీ
- అనస్థీషియాలజీ & నొప్పి వైద్యం
- అత్యవసర వైద్యం
- క్రిటికల్ కేర్/ICU
- ప్రత్యేక సేవలు: ఈ ఆసుపత్రిలో అంటు వ్యాధుల కోసం ప్రత్యేక విభాగం ఉంది మరియు COVID-19 వంటి వ్యాప్తిని నిర్వహించడంలో దాని పాత్రకు గుర్తింపు పొందింది.
- సంఘంలో పాత్ర: గ్రామీణ ప్రజలకు అందుబాటులో మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో RDT బత్తలపల్లి ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుంది, ఈ ప్రాంతంలోని ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలుఈ సంస్థని పాడు చెయ్యాలని అనుకుంటున్నారు . ప్రభుత్వాలు ఎలానో సహాయం చెయ్యరు విల్లు ఐనా చేస్తున్నారు కాదు కానీ వీళ్ళని కూడా చెయ్యనిస్తలేరు.
అనంతపురం పెద్దవాళ్లకు ఇదే ఓపెద్ద వరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్
RDT వాల్లు ఇప్పటివరకూ ఇచ్చిన సేవల్లో, సుమారు 84,791 గృహాలు నిర్మించారు. అలాగే 1,665 అనుబంధ-పాఠశాలలు-సమాజ కేంద్రాలు నిర్మించడం జరిగింది.