हिन्दी | Epaper

Hydra On Manholes: మ్యాన్‌హోల్‌ ఘటన పై కమిషనర్ రంగనాథ్ సీరియస్

Sudheer
Hydra On Manholes: మ్యాన్‌హోల్‌ ఘటన పై కమిషనర్ రంగనాథ్ సీరియస్

హైదరాబాద్ యాకత్‌పురలో ఓ చిన్నారి మ్యాన్‌హోల్‌(Manhole)లో పడిన ఘటన కలకలం రేపింది. స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఆటోను గమనిస్తూ వెళ్తుండగా పాప అనుకోకుండా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తు, వెంట వచ్చిన మహిళా సకాలంలో గమనించి, చుట్టుపక్కల వారి సహాయంతో చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన సమీప సీసీటీవీల్లో రికార్డ్ అవ్వగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జీహెచ్‌ఎంసీ నిరాకరణ, హైడ్రా బాధ్యత

ఈ ఘటనతో ప్రజల ఆగ్రహం జీహెచ్‌ఎంసీ(GHMC)పై వెల్లువెత్తింది. వర్షాకాలంలో మ్యాన్‌హోల్‌లను ఇలా నిర్లక్ష్యంగా తెరిచి ఉంచడమేంటని నెటిజన్లు మండిపడ్డారు. అయితే, జీహెచ్‌ఎంసీ మాత్రం ఈ ఘటనకు తమకు సంబంధం లేదని స్పష్టంచేసింది. మ్యాన్‌హోల్ నిర్వహణ బాధ్యతలు హైడ్రాకు అప్పగించబడినట్లు వెల్లడించింది. దీంతో విమర్శల దృష్టి హైడ్రాపై కేంద్రీకృతమైంది.

హైడ్రా అంగీకారం, చర్యలకు హామీ

తీవ్ర విమర్శల నడుమ హైడ్రా చివరికి స్పందించింది. కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఈ ఘటనకు హైడ్రానే పూర్తిగా బాధ్యత వహిస్తుందని అంగీకరించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జ్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం మరల జరగదని హామీ ఇచ్చారు.

https://vaartha.com/former-pithapuram-mla-varma-to-join-ysrcp/breaking-news/546232/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే.. డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు!

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

తినాలంటే భయం.. హోటల్లో పెరిగిన ధరల భారం

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

చేతికి రాని పంట.. తీరని అప్పులు: అన్నదాత ఆత్మహత్య

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

మండలిలో బిఆర్ఎస్ తీరుపై అద్దంకి దయాకర్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870