పెన్షన్ నిధుల విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa Pension) పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ 1న 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయడానికి రూ. 2,746.52 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) తెలిపారు.
కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారులకు కూడా సెప్టెంబర్ 1న పెన్షన్ అందించేందుకు రూ. 3.15 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు.
బడ్జెట్ కేటాయింపులు
2025–26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 32,143 కోట్లు కేటాయించగా, ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ. 16,366.80 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం కూడా పెన్షన్ కోసం రూ. 10,000 కోట్లకు మించి కేటాయించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
పెన్షన్ పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్ అందించడం తోపాటు వారి జియోకోఆర్డినేట్స్‌ను కూడా నమోదు చేస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఏపీ ముందంజ
ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిస్సహాయ వర్గాల సమస్యలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa Pension) పెన్షన్ పథకాన్ని ప్రధాన సంక్షేమ పథకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌మేనని మంత్రి శ్రీనివాస్ అన్నారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read also: