Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీతా అహుజా మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఒకవైపు విడాకుల కేసు(Divorce case) కోర్టులో నడుస్తుండగా, మరోవైపు గోవిందా తరఫు వారు సమస్యలేమీ లేవని, అన్ని సర్దుకున్నాయని చెబుతుండటంతో గందరగోళం పెరిగింది. 38 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దంపతుల వైవాహిక జీవితం ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సునీతా అహుజా 2023 డిసెంబర్ 5న ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13(1) కింద వ్యభిచారం, క్రూరత్వం, త్యజించడం వంటి తీవ్ర ఆరోపణలను ప్రస్తావించారు. ఈ కేసులో విచారణకు గోవిందాకు కోర్టు సమన్లు పంపించగా, ఆయన వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో 2024 మేలో షోకాజ్ నోటీసు కూడా జారీ చేయబడింది. జూన్ నుంచి కోర్టు ఆదేశాల మేరకు దంపతులకు కౌన్సెలింగ్ జరుగుతోంది. సునీతా విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా, గోవిందా పాల్గొంటున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ సమయంలో, గోవిందా న్యాయవాది లలిత్ బింద్రా మీడియాతో మాట్లాడుతూ, “విడాకుల కేసేమీ లేదు, అన్ని సర్దుకుంటున్నాయి. రాబోయే గణేష్ చతుర్థికి వారిద్దరినీ కలసి చూస్తారు” అని వ్యాఖ్యానించారు.

అంతా సర్దుకుంది -గోవింద్ లాయర్
ఇదిలా ఉండగా, గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని పుకార్లు (Rumors)వినిపిస్తున్నాయి. సునీత గతంలో, “12 ఏళ్లుగా నా పుట్టినరోజును ఒంటరిగానే జరుపుకుంటున్నాను. గోవిందా తన పనిలో బిజీగా ఉండడం, ఎక్కువగా మాట్లాడే స్వభావం కారణంగా మేము దూరంగా ఉన్నాం” అని చెప్పిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలను బలపరిచాయి. అంతేకాక, గోవిందా ఓ యువ మరాఠీ నటి తో సన్నిహితంగా ఉన్నారని వినిపిస్తున్న వార్తలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతలో కోర్టులో కేసు నడుస్తుండగానే, ఆయన తరఫు నుంచి వస్తున్న “అన్నీ సర్దుకున్నాయి” అనే ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి.
గోవిందా భార్య సునీతా ఎప్పుడు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు?
2023 డిసెంబర్ 5న ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆమె ఎలాంటి ఆరోపణలు చేశారు?
హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13(1) కింద వ్యభిచారం, క్రూరత్వం, త్యజించడం వంటి కారణాలను పేర్కొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :