Kobbari Boorelu:కావలసిన పదార్థాలు:
- బియ్యం – రెండు కప్పులు
- పచ్చికొబ్బరి – అర కప్పు
- బెల్లం – ఒకటిన్నర కప్పు
- నువ్వులు – పావు కప్పు
- వంటసోడా – అర టీస్పూన్
- యాలకుల పొడి – ఒక టీస్పూన్
- నూనె – వేయించడానికి సరిపడినంత

తయారు చేసే విధానం:
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నానబెట్టాలి. నీళ్లు (water) ఒంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకంగా పట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెను దింపి యాలకుల పొడి, వంటసోడా, నువ్వులు, పచ్చికొబ్బరి వేసి కొద్దికొద్దిగా పిండి వేస్తూ బాగా కలపాలి. పిండి ఆరిపోకుండా మూత పెట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ బూరెలు ఒత్తుకోవాలి. వాటిని వేడివేడి నూనెలో (oil) వేయించుకుంటే నోరూరించే కొబ్బరి బూరెలు రెడీ.

Read also:hindi.vaartha.com
Read also: