రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటి హబ్లు
గన్నవరం (విజయవాడ): ప్రపంచస్థాయి ఐటి కేంద్రంగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తామని ఈదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం ఐటిపార్క్ మేధాటవర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కోడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఈక్లాట్ ఐటి సంస్థను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ రానున్న రోజుల్లో విశాఖపట్నం ఐటికి చిరునామాగా మారతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతోపాటు ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటి హబ్లు ఏర్పాటు కావాలని ఇందుకోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ తమ కూటమి ప్రభుత్వ నినాదం అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణే మార్గం: ఐటీ, పరిశ్రమల ద్వారా లక్షలాది ఉద్యోగాలు
ఈదిశగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు లోకేష్ చెప్పారు. ఇందులో భాగంగా అనంతపురంలో (Anantapur) కియాను ఏర్పాటు చేయగా, కర్నూలులో రిన్యూవబుల్ ఎనర్జీసంస్థలు, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్ తయరీ సంస్థలు వచ్చాయన్నారు. నెల్లూరుకు ఎల్జీతో డైకిన్ సంస్థ ఏర్పాటు కానుందని తెలిపారు. ఆసియాలోనే మొదటి 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు కానుందన్నారు. ఉత్తరాంధ్రలో దేశంలోనే అతిపెద్దదైన ఆర్సెల్ మిత్తల్ స్టీలు కంపెనీ (Arcel Mittal Steel Company) ఏర్పాటు కానుందని, దీనికితోడు ఔషధపరిశ్రమలు వస్తాయని, గోదావరి జిల్లాల్లో ఆక్వాను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇదీ రీతిలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యం కారణంగా భర్తను కోల్పోయి బడ్డీకొట్టు నడుపుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్న మహిళను ప్రభుత్వం నుండి ఎమి కావాలని అడిగితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించమని కోరిందని, దీంతో తాను ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఆదిశగా ప్రయత్నాలు చేయటంతో ఇప్పటికే 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా యంఒయులు కుదుర్చుకోవటం జరిగిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే ముందుచూపు ఉన్న చంద్రబాబు వల్లే సాధ్యమైందన్నారు. ఆయన 20 ముందు ఏంజరుగబోతుందో, అప్పటి అవసరాలు ఏమిటో ఇప్పుడే ఆలోచించి అడుగులు వేస్తారని ప్రశంసించారు.
నారా లోకేష్ ఎంపీనా లేక ఎమ్మెల్యేనా?
నారా లోకేష్ ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యే, 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు.
నారా లోకేష్ కి పెళ్లయిందా?
వ్యక్తిగత జీవితం. 2007లో నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు నందమూరి బ్రహ్మణిని లోకేష్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నారా దేవాంశ్ అనే కుమారుడు ఉన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Project: రాక్ ఫిల్! ఎర్త్ డ్యామ్? అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్