हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Papaya Benefits : ఫ్రూట్స్ ఆఫ్ ఏంజిల్..

venkatesh
Papaya Benefits : ఫ్రూట్స్ ఆఫ్ ఏంజిల్..

Papaya Benefits : బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఇంటి పెరట్లో కనిపిస్తుంటాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు. ఆరోగ్య నిపుణులు. మనదేశంలోకి బొప్పాయి 400 ఏళ్లక్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. చక్కటి చర్మసౌందర్యానికి చిట్కాగా ఉపయోగించదగినది. ఈ పండులోని పోషక విలువల ఒక కేజీ బరువుండే బొప్పాయి నుంచి 120 క్యాలరీలు, 30 గ్రాముల కార్పొహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్, 15 శాతం విటమిన్ ‘ఎ’, 224 శాతం విటమిన్ ‘సి’, 19శాతం పీచు పదార్థం, 14శాతం మెగ్నీషియం, 14శాతం పొటాషియం, 13శాతం కాపర్, 11శాతం పాంటోథెనిక్ ఆమ్లం, 26 శాతం ఫోలేట్ లభిస్తాయి.

బొప్పాయి (Papaya) పండులో వున్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు. సంవత్సరమంతా దొరికే ఈ పండు ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా బొప్పాయి పండ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర పూర్వకాలం నుంచి అనేక ఆరోగ్య రుగ్మతలకు బొప్పాయిని ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం బొప్పాయి పండుమాత్రమే కాదు, అందులో ఏ విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరమే.

నిత్యం ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బొప్పాయి పండులో గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు. బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు. శ్రీలంక, భారత్, పాకిస్థాన్.. వంటి దేశాల్లో గర్భనిరోధానికి, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారు. ప్రస్తుతం బొప్పాయిని హవాయ్లో ఎక్కువగా పండిస్తున్నారు. మెక్సికన్లు దీన్ని ట్రీమెలన్ అనీ పాపా అనీ పిలుస్తారు.

పలకబారిన కాయల్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఐదారురోజులపాటు ఉంచితే బాగా పండుతాయి. మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగంలో, మెక్సికోలో ఎక్కువగా వాడే బొప్పాయి స్పానిష్, పోర్చుగీస్ యాత్రికుల ద్వారా ఇతర ప్రాంతాలకు పరిచయమైంది. చాలా పళ్లలాగే బొప్పాయి పండులో కూడా లోపల గింజలుంటాయి. గింజల్ని తీసేసి పండు తింట తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి ఉంటాం. బొప్పాయి పండు తిని గింజలను పడేస్తుంటారు కొంతమంది.

కానీ వాటిలోని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. బొప్పాయి పండు గింజల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అనారోగ్యసమస్యలతో పోరాటంతో పాటు, ఇమ్యునిటీ పవర్ని పెంచుతాయి. బొప్పాయి ఫేస్ ప్యాడ్ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా పడుతున్నారు. బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్ కేన్సర్లు రావు. పండులోని బీటా కెరోటిన్ కేన్సర్సీ రాకుండా నిరోధిస్తుంది. ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.

బొప్పాయిపండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి తగ్గుతాయి. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. పచ్చికాయ అధిక రక్తపోటుని (హైబీపీ) నియంత్రిస్తుంది. కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు వాడితే ప్లేట్లెట్లు కంటు పెరగడానికి పనిచేస్తుంది. డయాబెటిస్ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి, బొప్పాయి తగ్గిస్తుంది.

బొప్పాయిలోని బొప్పాయిను ట్యాబ్లెట్గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు. ఈ బొప్పాయి గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. పులియబెట్టిన బొప్పాయి నుంచి బొప్పాయి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. నొప్పినివారిణిగానూ (పెయిన్ కిల్లర్) పనిచేస్తుంది.

నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. తెలుగునాట పచ్చి బొప్పాయికాయతో వంటలు అంతగా ఇష్టపడతారు గాని, ఈశాన్య భారతంలో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానే బొప్పాయికాయని కూరగాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు.

Papaya Benefits : బొప్పాయి గింజల్లో పాలిఫినాల్స్, ప్లేవనాయిడ్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జలుబూ, దగ్గు లాంటి సామాన్యమైన సమస్యలనించే కాక దీర్ఘకాలిక అనారో గ్యాలనించి కూడా మనల్ని రక్షిస్తాయి. ‘అన్ని గింజలూ విషయం ఏం కాదు, కానీ, కొన్ని గింజలు మరీ చేదుగా ఉండటంతో అవి కడుపులో అసౌకర్యాన్ని కలుగచేస్తాయి’ చాలామంది పోషకాహార నిపుణులు కూడా వీటిని తినవచ్చనే చెప్తున్నారు.

ఈ గిజల్లో ఫైబర్ అధికంగా ఉన్నందున అరుగు దలకి తోడ్పడి అధికబరువు రాకుండా చేస్తాయి. ఈ ఫైబర్ బ్లడిజర్ని కూడా అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నియంత్రిస్తాయి. బొప్పాయి గింజల్లో మోనో అన్శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ‘ని తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ గింజల్లో ఓ మెడిసిన్ తీసుకోవచ్చు.

దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పీరియడ్స్ టైంలో బొప్పాయి గింజలు తినడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పి, క్రాంప్స్ తగ్గుతాయని కూడా అంటారు. అందుకే ప్రెగ్నెన్సీ టైమ్లో వీటిని తీసుకోవద్దు అని చెబుతుంటారు. డెలీవరీ, అబార్షన్ అనంతరం వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి. బొప్పాయి గింజలు అస్సలు రుచిగా ఉండవు. మరి వాటిని ఎలా తినాలి?

బొప్పాయి గింజల్ని పొడి చేసి జ్యూసులూ, స్మూతీలూ, టీ వంటి వాటిలో కలుపుకుని తాగచ్చు. వీటిల్లో కలిపే తేనె, పంచదార, బెల్లం వంటివి ఈ గింజల చేదుని పోగొడతాయి. ఇలా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ గింజల్ని పొడి- చేసి తీసుకోవచ్చు. బొప్పాయి సీడ్స్ ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికార బ్యాక్టీరియాన్ నాశనం చేస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ అరికట్టడానికి కూడా సహాయపడతాయి.

బొప్పాయి గింజలు ట్యూమర్స్, కేన్సర్ సెల్ డెవలప్ కాకుండా కాపాడుతాయి. ఇది లంగ్స్, కెలాన్, ప్రొస్టేట్ ల్యుకేమియా, బ్రెస్ట్ కేన్సర్ను నివారించడానికి సహాయపడతాయి. కిడ్నీ సమస్యలను సైతం దూరం చేస్తాయి. ఇది పేగులకు మేలు చేస్తుంది. అయితే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బొప్పాయి గింజలు 5. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

పరగడుపునే రెండు స్పూన్ల బొప్పాయి గింజలను రోజూ తింటుంటే మధుమేహం, హార్ట్ అటాక్వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రక్తసరఫరాకు సమస్యలకు బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపులో ఉండే విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపరడుతుంది. కడుపులో దంత ఉండే వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

బొప్పాయి సీడ్స్ ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. దాంతో ఫెర్టిలిటి మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మన కడుపులో ఉండే క్రిములు గింజలు తింటే నశిస్తాయి. బొప్పాయి పండులో ఉండే ఔషధగుణాలు శరీరబరువును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా వచ్చే జ్వరం దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

Papaya Benefits : బొప్పాయి గింజలను బాగా పేస్టులా రుబ్బుకుని అందులో కాసింత నిమ్మరసం చేసి తీసుకుంటే కాలేయ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. బొప్పాయి గింజల పొడిని వేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొప్పాయి గింజల పొడి అరస్పూన్ తీసుకుని తేనెతో కలుపుకుని తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రోజుకు 8-10లీటర్ల నీటిని సేవించడం మరిచిపోకూడదు.

అరగుప్పెడు బొప్పాయి గింజలను ఉడికించి ఆరిన తర్వాత సేవిస్తే కిడ్నీలో రాళ్లు రానీయకుండా నిరోధించవచ్చు. బొప్పాయి గింజల పొడి నీటిలో కలుపుకుని సేవించడం ద్వారా కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. బొప్పాయి గింజల పొడిని కొబ్బరి నూనెతో కలిపి తన మాడుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు దట్టంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

తెనే, బొప్పాయి విత్తనాల్లో ఉండే కొన్ని రకాల హెల్తీ లిపిడ్స్, పొటాషియం కాంబినేషన్స్ శరీరంలో మెటబాలిక్ రేటును పెచుతుంది. దాంతో బరువు తగ్గడం సులభమవుతుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల, ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ మజిల్ టిష్యులు బిల్డ్ చేయడానికి సహాయపడతాయి. మూత్రవిసర్జన అనేది క్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

శరీరం నుండి వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపించాలంటే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అయితే ఈ ప్రక్రియలో భాగంగా బొప్పాయి విత్తనాలు తినడం మూలానా అవి ఫిల్టర్గా పనిచేస్తాయట. పలు ఆరోగ్య నివేదికల ప్రకారం మూత్రపిండాలు సరిగా పనిచేయడానికి ఇవి సహాయపడతాయని తేలింది. బొప్పాయి విత్తనాలలో ఇతర సీడ్స్ మాదిరిగానే అధిక ఫైబర్ ఉంటుంది.

అంతేగాక వీటిలో ప్రోటీయోలైటిక ఎంజైములు కూడా ఉంటాయి. అయితే వీటిని తీసుకునే ముందు నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి విత్తనాలలోని అధిక అనామ్లజనకాలు, అధిక మూత్రపిండ కణాల నష్టాన్ని నిరోధించగలవని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొంది. మొటిమలూ తగ్గుతాయి.

బొప్పాయి ఫేస్ప్యాక్ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్ల కూడా ఎక్కువగా వాడుతున్నారు. శ్రీలంక, భారత్, పాకిస్థాన్ దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికి బొప్పాయిని వాడతారు.

జర జాగ్రత్త: బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి. అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు. పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్చన్ అనే యాంథెల్మింటిక్ ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది ఎక్కువైతే ప్రమాదకరం.(Papaya Benefits)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

📢 For Advertisement Booking: 98481 12870