Sweet Corn Benefits : వానొస్తే మొక్కజొన్నపొత్తు లేదా కంకి. సినిమాకి వెళితే పాప్కార్న్ రుచి చూడనివాళ్లు అరుదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైన స్నాక్ అంటే మొక్కజొన్న(sweet corn), కుక్కర్లో ఉడికించినా, నిప్పులపై కాల్చినా, గ్రిల్ చేసినా, సూప్లో కలుపుకున్నా, సలాడ్ చేసుకున్నా.. ఎలా అయినా సరే మొక్కజొన్న మొక్కజొన్నే. కాస్త తీపి మిళితమైన ఆ రుచే వేరు. కార్న్ని తక్కువ చేయడానికి వీల్లేదు. కేక్స్, కుకీస్, బ్రెడ్, చిప్స్, చాక్లెట్స్, ఐస్క్రీమ్, జూమ్స్, బేబీపుడ్, సెరిల్స్, ఛూయింగ్ గమ్స్, సూప్స్, డూనట్స్, పెటఫ్ఫుడ్ ఇలా నాలుగు వేల ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ఆహారేతర పదార్థాల్లో కూడా కార్నిని వినియోగిస్తున్నారు. బ్యాటరీలు, డిటర్జెంట్లు, కాస్మొటిక్స్, ప్లాస్టిక్స్, షాంపూ, షూ పాలిష్, బ్లాంకెట్స్, ప్లేట్స్, కప్పులు, క్రేయాన్స్, పెట్ఫుడ్స్ తదితర పరిశ్రమల్లో కార్నిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

మెక్సికోలో పుట్టింది — నేడు ప్రపంచమంతా కనిపించే మొక్కజొన్న సుమారు పది వేల ఏళ్లక్రితం మెక్సికోలో పుట్టింది. ఏపుగా పెరిగిన గడ్డికి ఉన్న కంకులను తొలిసారి ఆహారంగా తీసుకుంది అప్పటి నేటివ్ అమెరికన్లు. ఆ తరువాత అంతా పాకింది ఈ పంట. వంద గ్రాముల మొక్కజొన్న 365 క్యాలరీల శక్తిని అందిస్తుంది. అందుకే ఉదయం పాలతోపాటుగా, కార్న్ ప్లేక్స్ ను బ్రేక్ఫాస్ట్గా తీసుకునే దేశాలే అన్నీ. చాలా సంస్కృతుల్లో మొక్కజొన్నను మంచి ఆహారంగా భావిస్తున్నారు. ఉడికించిన, వేయించిన మొక్కజొన్నతో పాటు, కార్న్ మీల్, కార్న్ ఫ్లోర్, కార్న్ సిరప్లుగా వాడుతున్నారు. అయితే మొక్కజొన్నను ఎక్కువగా పండించే దేశాలలో అమెరికా, చైనా, బ్రెజిల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి.
రైతులు కొందరు అనేక రంగుల్లో కూడా మొక్కజొన్నను పండిస్తున్నారు. రంగును బట్టి ‘బ్లాక్ పెర్ల్’, ‘పింక్ కార్న్’ తదితర పేర్లు వచ్చాయి. కార్న్‌లో కార్బొహైడ్రేట్స్, ఫైబర్‌తో పాటు విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ లాంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. మొక్కజొన్న పూర్తిగా జీర్ణం కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే మధుమేహులకు మంచిది.
ఆరోగ్య ప్రయోజనాల్లో భాగంగా—మొగ్గజొన్నలో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఉదాహరణకి, 112 గ్రాముల పాప్కార్న్లో 16 గ్రాముల ఫైబర్ ఉంటుంది. గుండె ఆరోగ్య పరిరక్షణలో కూడా మొక్కజొన్న పాత్ర ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించే ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇందులోని పొటాషియం, ఫోలేట్, ప్లాంటెస్టెరాల్స్ గుండెకు మేలు చేస్తాయి. కార్బొహైడ్రేట్స్ వల్ల మొక్కజొన్న తిన్న వెంటనే నెమ్మదిగా శక్తి వస్తుంది, దీర్ఘకాలం నిలుస్తుంది.
కంటి ఆరోగ్యానికి అవసరమైన కరోటినాయిడ్స్ మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటాయి. ఇవి రెటీనాకు హాని కలగకుండా చూస్తాయి, కళ్ల వ్యాధుల నుంచి కాపాడతాయి. మొక్కజొన్న తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఎందుకంటే ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పైగా కార్న్‌లో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలని అనుకునేవారి డైట్‌లో తప్పనిసరిగా ఉంటుంది.

మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. విటమిన్ C అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, మొక్కజొన్నలో తగినంత ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత సమస్యకు ఇది మంచి పరిష్కారం అవుతుంది.
మొక్కజొన్నను ఇష్టమైన ఒక్కటే ఆహారంగా కాకుండా తగిన పరిమాణంలో వేడి వేడి తింటూ వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు. మొక్కజొన్న గింజల నుంచి తయారయ్యే నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీనిని వంట నూనెగా, సలాడ్, వేపుళ్లలో విరివిగా వాడతారు. ఒక స్పూన్ కార్న్ ఆయిల్ 122 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఇందులో 14 గ్రాముల కొవ్వు, 13 శాతం విటమిన్ E ఉంటుంది. కార్న్ ఆయిల్‌లో ఫైటోస్టెరాల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది గుండె వ్యాధులు, టైప్ 2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. అయితే ఈ నూనెను తక్కువ పరిమాణంలో వాడటం ఉత్తమం.(Sweet Corn Benefits)