పసిడి ప్రియులకు ముందు ముందు మంచి రోజులు వస్తున్నాయి. గత నెలలో నింగిని తాకిన బంగారం ధరలు ఈ నెలలో రోజు రొజుకు తగ్గుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారులంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(America President Trump) ఈ నెల 9న విధించబోయే కొత్త టారిఫ్ మీద దృష్టి సారించడంతో పసిడి తన వెలుగును కోల్పోయింది. ఈ రోజు MCX బంగారం ధర 0.5% పైగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి ధరలు తగ్గుతూ ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ(International) బులియన్ మార్కెట్లలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన ఛాయలు కనిపించడం..అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందా(Trade Deal)లలో పురోగతి సాధించామనే ప్రకటన.. వెరసి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
రోజు MCXలో బంగారం ధర 0.52 శాతం
ఈరోజు MCXలో బంగారం ధర 0.52 శాతం తగ్గి 10 గ్రాముల ధర రూ. 96,485 వద్ద కొనసాగుతోంది. నిన్న పసిడి ధర రూ.96,990గా నమోదైంది. నేడు ఉదయం 9:10 గంటల సమయానికి రూ. 96,500 వద్ద పసిడి ధర ట్రేడవుతోంది. వెండి ధర కూడా 0.38% తగ్గి రూ. 1,08,124 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా, స్పాట్ గోల్డ్ ధరలు 0.6% తగ్గి ఔన్స్‌కు 3,314.21 డాలర్లకు కు చేరాయి. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఇదే శాతం తగ్గాయి. వెండి ధరలు 0.8% పడిపోయి ఔన్స్‌కు 36.81 డాలర్లుగా నమోదయ్యాయి. అమెరికాలో ఆగస్ట్ 1 నుంచి ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 10% ప్రాథమిక టారిఫ్‌ను అమలు చేశారు. అయితే ఎక్కువ దేశాలకు ఈ టారిఫ్ అమలు తేదీని వాయిదా వేశారు.

ట్రేడింగ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం
ట్రేడింగ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం.. అమెరికా ఇప్పటికీ అనేక బహుళ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసే దశలో ఉంది. జూలై 9 నాటికి కొత్త అధిక సుంకాల రేట్లను ఇతర దేశాలకు తెలియజేయనుంది. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే, ఈ మూడు వారాలు ప్రభావిత దేశాలకు చర్చలు కొనసాగించడానికి గడువుగా ఉన్నాయి. ఈ వార్తలతో పాటు గత వారం విడుదలైన బలమైన అమెరికా ఉద్యోగాల డేటా వలన ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలను తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సుంకాల ప్రభావం ఉంటుంది కాబట్టి, ఫెడ్ జూలైలో రేట్లు తగ్గించకుండా ఉండే అవకాశం ఉంది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష కాల్పుల విరమణ చర్చలు
ఇక భౌగోళిక రాజకీయాల్లో, ఖతార్‌లో జరిగిన హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష కాల్పుల విరమణ చర్చలు ఫలితమే లేకుండా ముగిశాయి. ఈ పరిణామాలతో బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై పెట్టుబడిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినా.. కొనుగోలుకు ఇది మంచి సమయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు ముందు ముందు మరింత తగ్గే అవకాశముంది కాబట్టి లాభాలను బుక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
సోమవారం బంగారం ధరలు
జూలై 7 తేదీ సోమవారం బంగారం ధరలను పరిశీలిస్తే..భారతదేశంలో బంగారం ధర 100 గ్రాముల ధర రూ.32,800 తగ్గింది. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.9,82,900 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,01,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,37,200 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,290 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,720 గా నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rahul: ట్రంప్‌కు మోదీ అడుగులకు మడుగులొత్తుతారు: రాహుల్ గాంధీ