हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Virat Kohli: భారత్ విజయం.. స్పందించిన విరాట్ కోహ్లీ

Anusha
Virat Kohli: భారత్ విజయం.. స్పందించిన విరాట్ కోహ్లీ

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా చూపిన అద్భుత ప్రదర్శనపై మాజీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో చారిత్రాత్మక విజయాన్నందుకున్న టీమిండియాను సోషల్ మీడియా వేదికగా అభినందించాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌‌ (Shubhman Gill) తో పాటు ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటాడని కొనియాడాడు. ఫ్లాట్ వికెట్‌పై సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుత ప్రద్శన కనబర్చారని ప్రశంసించాడు.ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్‌కు గొప్ప విజయం. ఫియర్‌లెస్ గేమ్‌తో ఇంగ్లండ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు. బ్యాట్‌తో పాటు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ సత్తా చాటాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఫ్లాట్‌ పిచ్‌పై మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే.’అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన తొలి ట్వీట్ ఇదే కావడంతో ఇది వైరల్‌గా మారింది.

ఫ్యాన్స్‌కు అతని నిర్ణయం నిరాశకు

ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగానే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణం ఏంటనేది మిస్టరీగా మారింది. మానసికంగా అలసిపోవడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తెలిపాడు.మరో మూడేళ్ల పాటు కోహ్లీ ఆడుతాడని భావించిన ఫ్యాన్స్‌కు అతని నిర్ణయం నిరాశకు గురి చేసింది. కోహ్లీ (Virat Kohli) లేకుండా టీమిండియా, టెస్ట్‌ల్లో ఎలా ఆడుతుందోననే భయం అభిమానులను వెంటాడింది. కానీ శుభ్‌మన్ గిల్, కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు కెప్టెన్‌గా సత్తా చాటడంతో టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌటైంది. జెమీ స్మిత్ (Jamie Smith),(88) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఆకాశ్ దీప్(6/99) ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియా 1-1తో సమంగా నిలిచింది. లార్డ్స్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.సంక్షిప్త స్కోర్లు:భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167),ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70),భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్‌మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93),ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 271 ఆలౌట్( జెమీ స్మిత్ 88, ఆకాశ్ దీప్ 6/91).

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: ఓటమిపై బెన్ స్టోక్స్ ఏమన్నారంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870