తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana state Govt) వాణిజ్య కేంద్రా(business centries) లలో పనిచేసే ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతిచ్చింది.

అయితే, వారంలో పని వేళలు 48 గంటలకు మించరాదని స్పష్టం చేసింది.పరిమితి దాటితే మాత్రం ఓటీ వేతనం చెల్లించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రోజులో ఆరు గంటల పనివేళల్లో కనీసం అరగంట విరామం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విరామంతో కలిపి రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని ఆదేశించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పని వేళలను సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Telangana: అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై నోరూరించే కొత్త వెరైటీలు