हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sanju Samson: (KCL) రెండో సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ

Anusha
Sanju Samson: (KCL) రెండో సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన సంజూ శాంసన్ ఇప్పుడు కేరళ క్రికెట్ లీగ్‌లో (KCL) కూడా అదే స్థాయిలో హైప్‌ను సృష్టిస్తున్నారు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌పై డబ్బుల వర్షం కురిసింది. కేరళ క్రికెట్ లీగ్(KCL) రెండో సీజన్‌లో సంజూ శాంసన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. ఈ దిగ్గజ ఆటగాడిని కొచ్చి బ్లూ టైగర్స్ రూ.26.60 లక్షలకు కొనుగోలు చేసింది. సంజూ శాంసన్ బేస్ ధర రూ.3 లక్షలు కావడం విశేషం. కొచ్చి జట్టు సంజూ శాంసన్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది. కొచ్చి జట్టు ఆయన్ను రికార్డు ధరకు కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది. ఈ ఫ్రాంచైజీ రూ.50 లక్షల బిడ్డింగ్‌ (Bidding) లో సగానికి పైగా మొత్తాన్ని సంజూ శాంసన్‌పైనే ఖర్చు చేసింది. ఇది కేరళలో సంజూ శాంసన్ ఎంత పెద్ద ఆటగాడో తెలియజేస్తోంది. వేలం సమయంలో ఒక దశలో త్రిస్సూర్ టైటాన్స్ జట్టు సంజూ శాంసన్ కోసం పోటీ పడింది.

సంజూ శాంసన్‌పైనే ఖర్చు చేసింది

వారు రూ.20 లక్షలు బిడ్ చేశారు, కానీ ఆ తర్వాత కొచ్చి బ్లూ టైగర్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిడ్‌ను పెంచి సంజూ శాంసన్‌ను తమ సొంతం చేసుకుంది.తిరువనంతపురంలో జరిగిన వేలంలో అన్ని జట్ల బిడ్డింగ్ మొత్తం రూ.50 లక్షలు. అంటే ఒక జట్టు గరిష్టంగా రూ.50 లక్షలు మాత్రమే ఖర్చు చేయగలదు. ఈ పరిస్థితుల్లో కొచ్చి బ్లూ టైగర్స్ (Blue Tigers) తమ సగానికి పైగా డబ్బును సంజూ శాంసన్‌పైనే ఖర్చు చేసింది. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది, కానీ సంజూ శాంసన్ స్థాయిని బట్టి ఏ జట్టు అయినా, ఆయన కోసం ఇలా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ కోసం సంజూ శాసన్ ఏం చేస్తాడో చూడాలి.సంజూ శాంసన్‌తో పాటు కేరళ సహచరుడు విష్ణు వినోద్ (Vishnu Vinod) పైనా భారీగా డబ్బు కురిసింది. ఆయన ఈ సీజన్‌లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. ఆయన్ను ఆరీస్ కొల్లం రూ.13.8 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే జలజ్ సక్సేనాను అలప్పీ రిపుల్స్ రూ.12.4 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించాడు

ఐపీఎల్ 2025లో సంజూ శాంసన్ చివరిసారిగా కనిపించాడు. 18వ సీజన్‌లో గాయం కారణంగా సంజూ చాలా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. సంజూ శాంసన్ అందుబాటులో లేకపోవడంతో ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించాడు. ఐపీఎల్ 2025లో సంజూ శాంసన్ 9 మ్యాచ్‌లలో 36 సగటుతో, 140 స్ట్రైక్ రేట్‌తో ఆయన 285 పరుగులు చేశాడు. ఇప్పుడు సంజూ శాంసన్ (Sanju Samson) మరోసారి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ కనిపించనున్నాడు. సంజూ శాంసన్ టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌లలో ఒకరు. తన కెరీర్‌లో, ఈ కుడిచేతి వికెట్ కీపర్- బ్యాటర్ 304 మ్యాచ్‌లలో 29.68 సగటుతో 7629 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ బ్యాట్ నుంచి 6 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు వచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: CV Anand: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో సిరాజ్ సంచలనం..హైదరాబాద్ సీపీ ప్రశంసలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870