పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్. జూలై 5న బంగారం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. అమెరికా(America) ఉద్యోగ డేటా వెలువడిన తర్వాత అలాగే వాణిజ్య సుంకాల అంశంలో US-చైనా(America-China) మధ్య యుద్ధ విరమణ గడువు దగ్గర పడుతున్న వేళ, గ్లోబల్ మార్కెట్ల(Blobal Markets)లో పసిడి ధరపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రస్తుతం 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6,000 తగ్గి రూ. 9,87,200కి చేరింది. 10 గ్రాముల ధర రూ. 600 తగ్గి రూ.98,720కి చేరింది. ఇదే తరహాలో 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా తగ్గాయి. MCX బంగారం ధరలు రూ. 96,735 కనిష్ట స్థాయిని తాకి రూ. 96,988 వద్ద నిలిచాయి. వెండి మార్కెట్లో మాత్రం స్వల్ప లాభాలు నమోదయ్యాయి.

బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు
బంగరం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు ఏంటంటే.. అమెరికా ఉద్యోగ మార్కెట్ లో స్థిరత్వం కొరవడటంగా చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తుండటంతో పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి ఇతర అంశాల వైపు పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు అమెరికా-వియత్నాం మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కూడా బంగారం ధర తగ్గుదలకు కారణమైంది.
ప్రస్తుతం బంగారం ధరలు
రిద్దిసిద్ధి బులియన్స్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి ప్రకారం.. ప్రైవేట్ రంగంలో జీతాల తగ్గుదల మార్కెట్‌ను దెబ్బతీస్తోంది. మరింత ఉదార ద్రవ్య విధానం కోసం వాదనలు పెరుగుతున్నాయి. ఇక ట్రేడింగ్ పరంగా బంగారం 3,300 డాలర్లు (రూ.96,000) నుంచి 3,400 డాలర్ల (రూ.98,500) స్థాయిలో ట్రేడ్ అవుతుందని అంచనా. మోతీలాల్ ఓస్వాల్ సూచనల ప్రకారం, ప్రస్తుతం బంగారం ధరలు 30% పెరిగిన నేపథ్యంలో.. ఇకపై మరింత స్పష్టమైన మార్కెట్ కోసం పెట్టుబడిదారులు వేచి ఉండటం ఉత్తమం. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకోవాలంటే రూ.96,000 కంటే తక్కువ స్థిర ముగింపులో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్