క్యూలైన్ల క్రమబద్ధీకరణపై సూచనలు
Tirumala: తిరుపతిలో ఈ ఏడాది జనవరిలో తిరుమలేశుని దర్శనాల టోకెన్లకోసం జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ సత్య నారాయణమూర్తి నివేదించనున్న 200 పేజీల రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ రిపోర్టులో జనవరి 8వ తేదీ తిరుపతిలోని పలు చోట్ల భారీగా భక్తులు చేరుకున్నా క్యూలైన్ల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సౌకర్యాలు లేమి, భద్రత వైఫల్యాలు, అదికారుల నిర్లక్ష్యం వంటి కీలక అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో గత నాలుగు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పలువురు బాధితులైన సాక్షులను, విదుల్లో నిమగ్నమైన కీలక అధికారులను పిలిపించుకుని సమాచారం రాబట్టారు. ఈ మొత్తం సాక్ష్యాలను నివేదిక రూపంలో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన అంశాలు, రద్దీ నియంత్రణ పై సూచనలు చేయడం ఉందనేది సమాచారం. జనవరి 10నుండి 19వరకు తిరుమల ఆలయంలో పవిత్రమైన వైకుంఠ ద్వారదర్శనాలకు రమ్మని పిలవడం, తిరుపతిలో ఆఫ్లైన్లో టోకెన్లు జారీకి ముందు తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, సౌకర్యాలు (Precautions, arrangements, and facilities) కల్పించలేకపోవడమే తొక్కిసలాటకు కారణమని పలువురు బాధితులు ఇచ్చిన సమా చారం. ఆధారాలను జస్టీస్ సత్యనారాయణమూర్తి (Justice Satyanarayana Murthy) నమోదు చేశారు. అంతేగాక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణమని పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారుల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణం?
Tirumala: టిటిడి, పోలీసు, రెవన్యూ జిల్లా యంత్రాంగం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఆరుగురు మృతిచెందారని బాధితకుటుంబాలకు చెందిన ప్రత్యక్షసాక్షులు కమిషన్ కు తమ వాంగ్మూలం ఇచ్చారు. 50 మందివరకు తీవ్ర క్షతగాత్రులవడం విదితమే. జడ్జి విచారణ చేయడంతో బాధితులు దీనివెనుక అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. 1 అక్కడ పోలీసులు సరిగా పట్టించుకుని భద్రత కల్పించలేకపోవడంతో విశాఖకు చెందిన శాంతి మృతి చెందిందని వెంకటేశ్ ఇప్పటికే కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. పాలకొల్లుకు చెందిన ధనకుమార్ అనే ప్రత్యక్షసాక్షి తిరుపతి ఘటనపై కొన్ని విషయాలు వెల్లడించారు. పూర్తిగా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది – నిర్లక్ష్యం కారణంగా తొక్కిసలాట కారణమన్నారు. భారీగా వచ్చిన భక్తులకు భద్రత కల్పించలేకపోవడం ఏమిటనే అంశంపై కమిషన్ ఇప్పుడు నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ఆ రోజు విధుల్లో ఉన్న కొందరు సిఐలు, ఎస్ఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది సంచలనంగా మారింది. భక్తుల భద్రతలో, రద్దీని నియంత్రించడంలో టిటిడి అధికారులు బందోబస్తుకు వచ్చిన పోలీసులు, రెవెన్యూ విభాగం కూడా పూర్తిగా విఫలమైందనేది ప్రధాన ఆరోపణ.
Read hindi news: hindi.vaartha.com